Satsang AECS

మా తెలుగుతల్లి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ

మా తెలుగుతల్లి వేదికకు స్వాగతం !

మా తెలుగుతల్లి !

మా తెలుగుతల్లి బెంగుళూరు మహా నగరములోని తూర్పు ప్రాంతములో ది. 2-4-2003 న స్థాపించబడిన ఆధ్యాత్మిక , సాంస్కృతిక ,సేవా సంస్థ .గత 22 సంవత్సములుగా బెంగళూరు మహానగరములో ఉద్యోగ, వ్యాపార నిమిత్తముగా నివసించుచున్న ప్రవాస తెలుగువారి మేలుకలయికకు, సాహిత్య,సాంస్కృతిక ప్రోత్సాహ నిమిత్తము,అనేక కార్యక్రమములు నిర్వహించబడు చున్నసంస్థ.

ఇంతియే గాక ఈ సంస్థ  ద్వారా తెలుగు పాఠశాలల అభివృద్ధికి సహాయనొనరించుట మరియు బ్రతుకు తెరువుకొరకు విచ్చేసిన తెలుగువారికి వసతి, విద్య మరియు వైద్య సౌకర్యములు కల్పించుట,మొదలగుకార్యక్రమములు నిర్వహించబడు చున్నవి. ఈ సంస్థ ద్వారా 2020 సంవత్సరము వరకు ఉగాది,దసరా మరియు సంక్రాంతి వేడుకలు నిర్విఘ్నముగా జరుపబడినవి.

నిర్వహింపబడిన కార్యక్రములలో ఈ దిగువనుదహరించబడిన విషయములు చాలా ఆదరించబడినవి.

  1. బ్రహ్మశ్రీ సామవేదం షర్ముఖశర్మ గారి ఉపన్యాసము
  2. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి సుందరాకాండ ప్రవచనము
  3. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి కాశఖండ వివరణ
  4. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు గారి అష్థావధానము
  5. బ్రహ్మశ్రీ ఆచార్య బ్రహ్మానందం గారిన భక్తి గానలహరి
  6. బ్రహ్మశ్రీ శివరామకృష్ణ గారి హరికధాగానము
  7. శ్రీ మతి లక్ష్మీ కుమారి గారి సంగీతకచేరి

మా తెలుగు తల్లి సంస్థను అనేక విధములుగ ఆదరించిన వారిలో మధుర గాయకులు దర్శి ప్రసాదరావు గారు , తంగిరాల వెంకట సుబ్బారావు గారు, నిడుమామిడ శ్రీకంఠరావు గారు, చిలకల వెంకట సుబ్బారెడ్డి గారు మరియు కర్నాటక మాజీ గృహ అమాత్యులు శ్రీ అశ్వత్థ నారాయణరెడ్డి గారు ప్రముఖులు మా తెలుగుతల్లి ఆహ్వానముపై మా కార్యక్రమములను దిగ్విజయము కావించుటకు విచ్చేసిన ప్రముఖ సినీ తారలు శ్రీమతి షావుకారు జానకి, శ్రీమతి కృష్ణకుమారి,శ్రీమతి జయంతి మరియు శ్రీమతి మంజుభార్గవి గార్లు. మా తెలుగు తల్లి  ఇట్టి కార్యక్రమములు  నిర్వహించుటకు అనేకమంది మహనీయులు మహారాజ పోషకులుగా వారి సహాయ సహకారములు అందించుటయే ముఖ్య కారణం సంస్థ కార్యక్రమములను జయప్రదముగాస నిర్వహించుటకు ఇతోధికముగా సహాయసహకారములు అందించిన మహానుభావులు

శ్రీ కె. హరీష్ గారు చైర్మన్ వాగ్దేవి విద్యా సంస్థలు

శ్రీ చంద్రయ్య నాయుడు గారు , కార్యదర్శి సైట్ ఫిలోమిన విద్యాసంస్థలు

శ్రీ తిప్పా రెడ్డి మరియు శ్రీ విజయకుమార్ గార్లు , ప్రముఖవ్యాపారవేత్తలు

2020 నుండి కరోనా కారణంగా ప్రత్యక్ష కార్యక్రమముల బడులు “తెలుగు సత్సంగ వేదిక “ అనుపేరుతో సాంకేతిక సహాయము ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమములు ప్రారంభించబడి ప్రతిరోజు సా.4. 00 గం టల నుండి గం. 5.00 వరకు నిరవహింపబడుచున్నవి.ప్రస్తుతము మా తెలుగుతల్లి కార్యక్రమములు ఆధ్యాత్మిక విభాగము ఆన్లైన్ ద్వారా మరియు సాంస్కృతిక, సాంఘిక, సేవా కార్యక్రమములు ప్రత్యక్షముగా జరుపబడుచున్నవి.  మా తెలుగు తల్లి సగౌరవముగా తమరిని మహారాజ పోషకులుగా ఆహ్వానించుచు  మేము తలపెట్టదలచిన కార్యక్రమములను ప్రోత్సహించ వలసినదిగా ప్రార్థన 

ఇట్లు,

 అధ్యక్షులు : కొమార్రాజు ఉమామహేశ్వర రావు                                                                            కార్యదర్శి :ఇందిర బెల్దె

i7
సభ్యులు
+
i3
సంవత్సరాల అనుభవము
+
i4
కార్యక్రమాలు
+
i8
రచనలు
+