ఆధ్యాత్మిక విషయాల పై జ్ఞానం పెంపొందించుకొని తద్వారా మనసుకు శాంతిని, సానుకూల ఆలోచనలను పెంపొందించుకొని అహంకారం తగ్గించుకొని, జీవితం పై స్పష్టతను, ప్రశాంతతను అందించగలిగేది సత్సంగం. శ్రీ నాగేశ్వర రావు, శ్రీ సుబ్రహ్మణ్యం గార్ల ఆలోచనల ఫలితంగా జులై 2014 సం|| శ్రీ నాయుడి గారి ఇంట్లో తొలి తెలుగు సత్సంగ ఆధ్యాత్మిక విభాగ సమావేశం జరిగింది. ప్రథమ సమావేశంలో ప్రథమ ప్రవచనం శ్రీమద్రామాయణం మీద శ్రీ సూర్య నారాయణ మూర్తి గారు చేశారు. శ్రీ హరగోపాల శర్మ గారు భగవద్గీత , శ్రీ గురుస్వామి గారు భాగవత, భారతంలోని పద్యాలను వివరించేవారు. శ్రీ హరగోపాల శర్మగారు ప్రవాసం వెళ్ళడంతో శ్రీ రమణమూర్తి గారు భగవద్గీత ప్రవచించేవారు. కరోనా వల్ల ఆగిపోయిన సత్సంగం 2020 , జులై 24 వ తేదీ ఆన్లైన్ గూగుల్ మీట్ ద్వారా ప్రతి రోజు సాయంకాలం గం.4 .00 నుంచి గం. 5 .00 వరకు తిరిగి మొదలైంది. శ్రీ ఉమామహేశ్వర రావు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమములు ఈ సత్సంగంలో చోటు చేసుకున్నాయి. 10 మంది సభ్యులతో మొదలైన సత్సంగం క్రమేపి పెరిగి 50 కి పైగా చేరింది. విశేష వ్యక్తుల ప్రసంగాలు నిర్వహించబడుతున్నాయి. విశేష వ్యక్తుల ప్రవచనాలకు , విశేష కార్యక్రమములకు పారితోషకం కొరకు సభ్యుల దగ్గర రూ. 100 చందా తీసుకొనుటకు నిర్ణయింపబడినది. భగవద్గీత, భారత, భాగవత పురాణాలు, స్తోత్రాలు, శతక నీతి సాహిత్యాలు మొదలైన ఆధ్యాత్మిక విషయాలను సభ్యుల నుంచి , విశేష వ్యక్తుల ప్రసంగముల ద్వారా తెలుసుకొనడం అందరికి ముదావహం.