Satsang AECS

మే నెల దినసరి కార్యక్రమములు

తేది                                        వారము                    వక్తపేరు                                                                             విషయము

1-5-25                          గురువారం             ఆధ్యాత్మిక సదస్సు-మొదటిసమూహమ            షోడశమహా రాజులు

  1.                                                శ్రీ యాదగిరి స్వామి గారు- యయాతి మహారాజు
  2.                                                ⁠శ్రీమతి భారతి గారు- రంతిదేవుని గురించి
  3. ⁠                                               శ్రీమతి రమణి గారు- (1) సహోత్ర మహారాజు (2) శశిబిందువు మహారాజు  (3) శిబి చక్రవర్తి గురించి

2-5-25                         శుక్రవారం              శ్రీ కె. ఉమా మహేశ్వర రావుగారు                          పురాణ సాహిత్య పరిచయం – పద్మ పురాణం

పునశ్చరణ : కాశీ నగరంలో మరణించాలనే కోరిక గల ఒక భక్తుని కోరిక  ఆ జన్మ లో తీరక, తదుపరి జన్మలో చర్మకారుడిగా జన్మించి అపార జ్ఞానవంతుడై , మార్కండేయుని కి ఉత్తమ శిష్యుడుగా ప్రసిద్ధికెక్కి , ఉత్తరాధికారిగా నియమింపబడి, తన శిష్య బృందం తో తీర్థయాత్ర లు చేస్తూ… దత్తాత్రేయుని అనుగ్రహం పొందిన కార్తవీర్యార్జునుడు పాలించిన మాహిష్మతీ రాజ్యానికి చేరుకోవడం , మంకెన మహర్షి ఆశ్రమం దర్శించే వరకు పునశ్చరణ చేశారు

తదుపరి పద్మపురాణంలో వర్ణించిన -భృగమహర్షి , పులోమల పుత్రుడు చ్యవన మహర్షి జన్మ వృత్తాంతము, చ్యవన మహర్షి కి , చర్వాతి మహారాజు కుమార్తె సుకన్యతో వివాహం జరిగే ఘట్టం ఎంతో హృద్యంగా వివరించారు

 3-5-25                       శనివారం                   శ్రీ వి.యస.శర్మగారు                                            మహాభాగవతం

పునశ్చరణ : బ్రహ్మకు శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి సృష్టి కార్యం ఎలా చెయ్యాలో చెప్పడం ,నారదుడు బ్రహ్మ దగ్గరకి వచ్చి పరబ్రహ్మ మాయ గురించి అడగడం, నారదుడి సందేహ నివృత్తికోసం బ్రహ్మ భాగవతపురాణాన్ని చెప్తాననడం

ప్రస్తుత విషయం: మూడవ స్కంధం- పరీక్షిత్ మహారాజుకు శ్రీ శుకుడు భాగవత కథ చెప్తూ , శ్రీ కృష్ణ రాయబారం , ధృతరాష్ట్రుడు విదురుని మాట పెడ చెవిని పెట్టి అవమానించడం, విదురుడు అరణ్యానికి వెళ్ళడం ,ఉద్దవుణ్ణి కలిసి జరిగిన విషయాలను విదురుడు అడిగి తెలుసుకోవడం , వివరించారు

4-5-25                    ఆదివారం                  సెలవు

5-5-25                    సోమవారం                 శ్రీ త్రినాధరెడ్డిగారు                                                  భగవద్గీత

సిద్ధాంతపరంగా పరమాత్ముని అర్థంచేసుకునే ప్రయత్నం జరిగింది. భగవంతుడు భౌతికప్రపంచం యొక్క పరిమితులైన నిడివి, ద్రవ్యరాశి, కాలాలకు అతీతుడుగా నిర్వచించబడ్డాడన్న అంశాన్ని చర్చించడం జరిగింది. ఆధ్యాత్మికతలో కూడా సైన్స్ లో లాగానే సిద్దాంతాలు పరిగణన, పరిశీలన, చర్చల ఆధారంగా ప్రతిపాదించబడతాయి అన్న అంశాన్ని భగవద్గీతా పరంగా చర్చించడం జరిగింది. సైన్స్ లోనూ అధ్యాత్మికతలోనూ కూడా సిద్దాంతాలు మారుతూ ఉంటాయి అనే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. యోగం యొక్క నిర్వచనాన్ని భగవద్గీతా పరంగా గ్రహించే ప్రయత్నం జరిగింది. యోగం అంటే ద్వంద్వాలకు అతీతంగా సమత్వ భావం కలిగి, పనిలో నేర్పరితనం కలిగి, జ్ఞానవిజ్ఞానములతో నిండిన మనస్సు కలిగి వికారరహితుడై, ఇంద్రియ నిగ్రహము కలిగి, కర్మఫలితాన్ని ఆశించక, మట్టిని రాతిని బంగారాన్ని సమానంగా చూచే మానసిక స్థితి కలిగి, దుఃఖసంబంధమే లేని ఇంద్రియములకు అతీతమైన అనంతమైన దివ్యమైన ఆనందానుభూతి పొందుతూ, సర్వప్రాణికోట్ల ఎడల సమదృష్టి కలిగిన ఉన్నతమైన మనోభావం కలిగి ఉండటం అని అర్థంచేసుకునే ప్రయత్నం జరిగింది.

6-5-25                    మంగళవారం              శ్రీ బద్రీరాంగారు                                                      మహాభారతం

 రోమశమహర్షి  ధర్మరాజుకు చ్యవన మహర్షి అనేక సంవత్సరములు తపస్సు చేయుచుండగా సంయాతి రాజు కూతురు సుకన్య మహర్షి తపస్సు భంగం చేయగా , మహర్షి కోపించి  సంయాతి సైన్యమునకు మూత్రపురీషములు బందింపచేశాడు, అది తెలుసుకున్న సంయాతి తప్పును క్షమించమని వేడుకొని తన పుత్రిక సుకన్యను ఇచ్చి వివాహము చేసేను.  సుకన్య తన పతియందు అధికభక్తి కలదై సేవలు చేస్తూ ఆనందముగా వుండినది, అశ్వనీ దేవతలు ఆమెను పరీక్షించదలచి మా ముగ్గురిలో నీకు నచ్చినవారిని వివాహము చేసుకోమనగా, సుకన్య తన పతి అయిన చ్యవనుడే కావలెనని కచ్చితంగా చెప్పడంతో, అశ్వినీ దేవతలు మెచ్చి చ్యవనుడికి నిత్య యౌవన రూపం ప్రసాదించిరి . చ్యవనుడు ప్రత్యుపకారంగ  అశ్వినీ దేవతలకు సోమరసం ఇవ్వాలని యజ్ఞం చేసి సోమము అందరి దేవతలకు ఇచ్చి అశ్వినీ దేవతలకు ఇవ్వబోగా దేవేంద్రుడు అడ్డపడి కోపించి వజ్రాయుధం ప్రయోగించగా దానిని తన స్థంభన విద్యతో స్తంభింప చేశాడు, వేదములచే యజ్ఞము కావించి మదనుడు అనే రాక్షసుణ్ణి పుట్టించాడు, అతడు చాలా అపార బలవంతుడు, దేవేంద్రుడు క్షమాపణ కోరినందులకు, మధు రాక్షసుణ్ణి కల్లు, స్త్రీ, వేట, జూదము నందు నివసించేటట్లు చేశాడు, అశ్వినీ దేవతలు సోమపానము చేసి స్వర్గానికి వెళ్ళారు.

7-5-25                    బుధవారం                 శ్రీ ఉమామహేశ్వరరావు గారు                                      పురాణసాహిత్యం

8-5-25                    గురువారం                 ఆధ్యాత్మిక సదస్సు- రెండవసమూహం                    విషయం : షోడశసంస్కారాలు

  1.                                               K శ్రీనివాస మూర్తి – గర్భాదానం
  2.                                               అన్నంరాజు – నామకరణం
  3.                                               రమాదేవి – వివాహం, సీమంతం
  4.                                               గీత – ఉపనయనం
  5.                                               నైనావతి – అక్షరాభ్యాసం, స్నాతకం
  6.                                               శ్రీనివాస మూర్తి – అంత్యేష్టి

9-5-25                    శుక్రవారం                 శ్రీమతి కళావతి గారు                                                    విష్ణుసహస్రనామాలు

70 వ శ్లోకం “కామదేవః కామపాలః ———“నుండి 71 వ శ్లోకం “ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా …..”వరకు గల నామాల అర్థాలను సవివరంగా , చక్కగా వివరించారు.

10-5-25                   శనివారం                  శ్రీమతి సుజాత కర్ర                                                       హనుమాన్ చాలిసా

 హనుమాన్ చాలిస లోని అన్ని పద్యాలకు వివరణ ఇచ్చారు.తదుపరి శ్రీమతి కళావతి గారు సవివరంగా హనుమాన్ చాలీసాను వర్ణంచి చెప్పారు.

11-5-25                    ఆదివారం                 సెలవు

12-5-25                 సోమవారం                 శ్రీ OSVరమణమూర్తి గారు                                              ఈశావాస్యఉపనిషత్తు

బుద్ద జయంతి సందర్భంగా శ్రీ విశ్వకిరణ్ మరియు శ్రీ సాయిబాబా గార్లు బుద్ధుని గురించి విషయాలు సభ్యులకు తెలియజేయడం జరిగింది.

శ్రీ రమణమూర్తి గారు ఈశవాస్య ఉపనిషత్ గురించి చెప్పారు. మనస్సు కన్నా వేగం అయింది అన్నింటికన్నా ముందే ఉండేది,నీరు కూడా వాయు పీడనంతో ఆగుతున్నది, అద్భుత శక్తి ఏంటి అంటే ఆత్మ అన్నింటికి అధిష్టానం అయి ఉన్నది. ఆత్మను విభజించుటకు వీలు కాదు. ఒక్కొక్క ఇంద్రియం వాటి అధిష్టాన దేవతల గురించి చెప్పారు. ఇంద్రియ శక్తి ఆ పరమాత్మ నుండే వస్తున్నది, అయితే పరమాత్మను మనం చూడలేకున్నాము. అన్నిటియందు అంతటా వ్యాపించినవాడు అని తెలియ చేశారు

13-5-25                   మంగళవారం              శ్రీ బద్రీరాం గారు                                                          మహాభారతం

 సోమకుడు తన నూరు గురు భార్యలకు సంతానం కొరకు ఋత్విక్కుని సలహాతో  రాజకుమారుని వధించి యజ్ఞము నందు వేసి హోమము చేయగా వచ్చిన పొగను పీల్చి నూరుగురు కొడుకులను కన్నాడు. రాజు స్వర్గమునకు ఋత్విక్కుడు నరకానికి వెళ్ళారు, సోమకుడు తన పుణ్యముతో పురోహితుని కూడా స్వర్గమునకు తీసుకెళ్లాడు.. ఇక్కడ కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే తపస్సు గొప్పదని సోమషమహర్షి ధర్మరాజుకు చెప్పి, ఈ యమునా నది యందు స్నానము చేసి తరించమన్నాడు. తరువాత అష్టావక్రుని చరిత్ర గురించి చెప్పారు. ఏకపాదుడు అను మహర్షి తన శిష్యులకు ఎల్లేవేళలా వేదము నేర్పిస్తున్నందువలన శిష్యులు అలసట వలన వేదాన్ని అపస్వరంతో పలకడం మహర్షి భార్య కడుపులోవున్న శిశువు తన తండ్రికి తెలియచేసినందువలన, తప్పు పట్టావని కోపముతో ఎనిమిది వoకరలతో  జన్మించమని శాపము ఇచ్చినందువలన అష్టావక్రునిగా జన్మించి, జనక మహారాజు దగ్గరకు వెళ్ళి వాదనలో జయించి వారితో పూజలందుకొని  కనపడకుండా పోయిన తన తండ్రిని అతనితో పాటు మిగతా పండితులను కూడా విడిపించిన చరిత్ర గురించి వివరించారు.

14-5-25                   బుధవారం                 శ్రిమతి అరుణ గారు                                                        రామాయణం

15-5-25                   గురువారం                 ఆధ్యాత్మికసదస్సు                                                          మూడవ సమూహం

                                                                    విషయం: తెలుగువారి కల్యాణ విధానణ

  1.                                               శ్రీమతి అన్నపూర్ణ గారు – నిర్వహణ
  2.                                               శ్రీమతి కృష్ణవేణి గారు. – ఉపోద్ఘాతం
  3.                                              శ్రీమతి కళావతి గారు – నిశ్చితార్డం , పెళ్ళ ఏర్పాట్లు
  4.                                              శ్రీ యన.వి.యస్ చెట్టి గారు – కన్యాదానం<,మాంగల్యధారణ
  5.                                              శ్రీ చిదానందమూర్తి గారు – తలంబ్రాలు,సప్తపడి
  6.                                              శ్రీ సాయిబాబా గారు – సఖ్యత ఐక్యత
  7.                                              శ్రీ విజయసింహ గారు – సత్యన్నారాయణ వ్రతం

16.05.2025             శుక్రవారం                  శ్రీ ఉమామహేశ్వర రావు గారు                                              పద్మ పురాణం

పునశ్చరణ : చక్కగా , ఆదర్శప్రాయంగా ,సాగిన చ్యవన , సుకన్యల దాంపత్య  జీవనం, నారదుడు వివరించిన ధర్మ సూత్రాలు, గృహస్థాశ్రమ ధర్మాలు, తీర్థ యాత్రల లక్ష్యం, క్షేత్రమహిమ ను, స్థల పురాణాన్ని తెలుసుకోవాలి.

చ్యవనమహర్షి శిష్యులతో చేసే తీర్థ యాత్ర లో భాగంగా బదరికాశ్రమానికి దగ్గరగా నారదుల వారు తపస్సు చేసిన కురుక్షేత్రాన్ని దర్శించడం , నారదుని పూర్వ జన్మ లోని – ఉపహర్ణుడి కథ తెలియజేశారు.

17.05.2025             శనివారం                     శ్రీమతి రమణి గారు                                                             ముకుందమాల

పునశ్చరణ : 1 నుంచి 23 శ్లోకాలు

24 వ శ్లోకం నుంచి 28 వ శ్లోకం వరకు ప్రతి పదార్థంతో , తాత్పర్య సహిత భావాలను  వివరించారు

18-5-25                   ఆదివారం                  సెలవు

19-5-25                   సోమవారం                 త్రినాధరెడ్డిగారు                                                                    భగవద్గీత

భగవద్గీతా పరంగా తప్పొప్పులను నిర్ణయించే విధానాన్ని చర్చించడం జరిగింది. మనకు లభించే పాపపుణ్యాలు మనం చేసే పనులపైగాక మనం ఏ మనోభావంతో ఆ పనులు చేస్తున్నామన్నదానిపై ఆధారపడి ఉంటాయన్న మరియు ఇంద్రియతృప్తి కొరకు కాక ఇంద్రియనిగ్రహంతో, తన వ్యక్తిగత ప్రయోజనాల కొరకుగాక కర్తవ్యనిర్వహణకై,  తాను చేస్తున్న కార్యంపట్ల పూర్తి అవగాహనతో, జ్ఞానంతో, ఆశ ఆసక్తులను విడచి, తామరాకుపై నీటిబొట్టులా, భగవదర్పణభావంతో, యజ్ఞభావనతో, ఏ కార్యం చేసినా పాపం కాదు ఆమోదయోగ్యమే అన్న శ్రీకృష్ణ పరమాత్ముని సందేశాలను గ్రహించే ప్రయత్నం జరిగింది. భగవద్గీతా పరంగా కర్మాచరణ మోక్షానికి ప్రతిబంధకమా అన్న అంశాన్ని చర్చిస్తూ మోక్షానికి మార్గం కర్మలను సన్న్యసించడం కాదు. జ్ఞానంతో, యజ్ఞభావనతో, కర్మయోగాన్ని ఆచరిస్తూ కర్మఫలాన్ని త్యజించడం ద్వారా అకర్మను సాధించడమే మోక్షానికి మార్గం అన్న శ్రీ కృష్ణ భగవానుని ప్రబోధాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం జరిగింది.

20-5-25                  మంగళవారం              శ్రీ బద్రీరాం గారు                                                                    భారతం

రోమశమహర్షి ధర్మరాజుకు తీర్థయాత్రలలో  రైబ్యుడు అనే మునికి ఇద్దరు కుమారులు అర్థావశుడు, పరావశుడు, ఇద్దరు కూడా సకల విద్యలను అభ్యసించారు. భరద్వాజుడు మునికి అవక్రీతుడు అనే కొడుకు గురువుల వద్ద విద్యను అభ్యసించక ఘోర తపస్సు చేసి సకల విద్యలను సాధించి వారికన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలని, తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై ఈ విధానం తప్పు దీనివలన మదమాత్సర్యములు వస్తాయి తప్ప విద్య రాదు అని చెప్పినప్పటికీ తపస్సు కొనసాగించగ ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషంలో వచ్చి గంగకు వరదను ఆనకట్ట ఇసుకతో వేయాలని ప్రయత్నించగా          అవక్రీతుడు నీవు ముసలివాడవు నీ చేతకాదు అని చెప్పగా, ఇంద్రుడు తన రూపం చూపించి నీకు తెలియాలని అలా చేశాను, అదేవిధంగా నీవు గురు ముఖముగా మాత్రమే విద్యలను అభ్యసించాలి అని పలికెను. అయినను నా తపస్సు మాననని కొనసాగించగా, ఇంద్రుడు తథాస్తు అని వరములిచ్చి వెళ్ళిపోయెను.

తన తండ్రి భరద్వాజుని వద్దకు వెళ్ళి వరము పొందిన విధానము తెలిపెను. రైబ్యుని కొడుకు పరావశుడు  తండ్రిని చంపి తన అన్న అర్థావశుడికి తెలిపి నాకు బ్రహ్మ హత్యా పాతకము పోయేటట్లు చెయ్యమనగా అన్న సత్రయాగం చేయగా దేవతలు వరము కోరుకొమ్మనగా తండ్రి రైబ్యుని, భరద్వాజ మునిని ఆయనకొడుకు అవక్రీతుడిని జీవించి ఉండేటట్లు కోరుకున్నాడు.

కాబట్టి గురుముఖంముగానే విద్యను నేర్చుకోవాలి, అట్టి విద్య మాత్రమే ప్రకాశింపగలదు, ప్రారబ్ధ కర్మ ఎప్పటికీ ఎవ్వరిని వదలదు అని తెలియచేశారు.

21-5-25                   బుధవారం                 శ్రీమతి రమణి గారు                                                                  ముకుందమాల

పునశ్చరణ : 17, 21, 28 శ్లోకాల భావం   తదుపరి 29 వ శ్లోకం నుంచి 35 వ శ్లోకం వరకు గల శ్లోకాలను , ప్రముఖ గాయకుడు శ్రీ P.B. శ్రీనివాస్ గారు ఆలపించిన ఈ శ్లోకాల ఆడియోలను , శ్రీ విశ్వకిరణ్ గారి సహాయంతో , వినిపిస్తూ ఆ శ్లోకాల భావాలను ప్రతి పదార్థ సహితంగా వివరించారు.

22-5-25                  గురువారం                 ఆధ్యాత్మికసదస్సు                                                                   నాల్గవ సమూహం

                                                                   విషయము : ఆధ్యాత్మిక రంగములో దేవతామూర్తులు-అంతరార్ధము

  1.                                              శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు – నటరాజ స్వామి విగ్రహమా యొక్క విశిష్ఠత- అంతరార్థం
  2.                                              ⁠శ్రీమతి ప్రేమాప్రసాద్ గారు – శివ తాండవ స్తోత్రం – భావ వివరణ
  3.                                              ⁠శ్రీమతి శారద సరిపల్లి గారు- సరస్వతీ దేవి విగ్రహ అంతరార్థం
  4.                                              ⁠కార్యక్రమ నిర్వహణ : శ్రీ విశ్వ కిరణ్ గారు

23.5.2025.              శుక్రవారం                 శ్రీ  శ్రీనివాసమూర్తి గారు                                                              శ్రీ రామ జననం

దశరథుని పుత్ర కామేష్ఠి యాగం, యాగంలో లభించిన పాయసాన్ని రాణులకు పంచడం, రామదండు జననం ,రామ లక్ష్మణ భరత శతృఘ్నుల నామకరణ విశేషం

⁠రామనామ ప్రాశస్త్యాన్ని తెలిపే కథ ,⁠రామ లక్ష్మణుల విద్యాభ్యాసం , ⁠విశ్వామిత్రుని రాక, ⁠యాగ సంరక్షణ కై విశ్వా మిత్రుని వెంట రామ లక్ష్మణుల గమనం

24.5.2025                శనివారం                 శ్రీ వి. యస్ . శర్మ గారు                                                                భాగవతం

పునశ్చరణ : కృష్ణ రాయబారం , దుర్యోధనుని చేత అవమానింపబడిన విదురుడు మనస్తాపం చెంది , అరణ్యాలకు వెళ్ళడం , తీర్థ యాత్రలు చేస్తూ మైత్రేయ మహర్షిని,ఉద్దవుడిని కలవడం, విదురుడు పాండవుల , శ్రీ కృష్ణుని క్షేమ సమాచారాన్ని అడగడం   ఉద్దవుడు శ్రీ కృష్ణ నిర్యాణం గురించి చెప్ప లేక పోవడం శ్రీ కృష్ణ లీలలు ,కాళింగ మర్దనం, గోవర్ధన గిరిని ఎత్తడం , మహేంద్రుని గర్వ భంగం

25-5-25                  ఆదివారం                సెలవు

26-5-25                  సోమవారం              శ్రీ రమణమూర్తి గారు                                                                    ఈశావాస్య ఉపనిషత్తు

27-5-25                  మంగళవారం          శ్రీ బద్రీరాం గారు                                                                          మహా భారతం

శ్రీ భద్రిరామ్ గారు, మహాభారతంలో భాగంగా,సోమశ మహర్షి తీర్థ యాత్రల్లో భాగంగా యమునా నది విశిష్టత చెప్పగా, ధర్మరాజు  వారి  బృందం యమున నదిలో సంకల్పం చెప్పుకొని యమున నదిలో స్నానం చేసి బయటకు వచ్చి దేవ, యక్ష, కిన్నర,గంధర్వ, అశ్వినీ,ఇంద్ర లోకములు కనబడ్డాయి అని చెప్పారు, అర్జునుడు గాండీవం పట్టుకొని ఇంద్రుని ప్రక్కన నిలబడగా చూచాడు. ఇది అంతయూ నది మహత్యం మరియు శ్రీకృష్ణుని మీద భక్తి వలన అంతమంది కనబడ్డారు.

అక్కడనుండి వారు గంధమాదన పర్వతం బయలుదేరారు. రోమష మహర్షి ఈ పర్వతం అధిష్టించడం చాలా కష్టం, చాలా దుర్భేద్యమైనదని చెప్పగా ధర్మరాజు మిగతా సమూహమును ఇక్కడే ఉండమని చెప్పగా భీముడు లేదు అందరం వెళ్ళాలని వీలుకాకపోతే భుజాల మీద ఎత్తుకొని వెళతానని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు సలహా మేరకు భీముడి కొడుకు ఘటోత్కచుడిని  పిలవగా అతను వచ్చి అందరిని తన వీపుమీద ఎక్కించుకొని గంధమాదన పర్వతం మీద దించి పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయాడు. బదరి వృక్షములతో దట్టమైన అరణ్యం ధర్మరాజు తన పరివారంతో చేరారు.

28-5-25                  బుధవారం                 శ్రీమతి  కళావతి గారు                                                                   విష్ణుసహస్రనామాలు

29-5-25                  గురువారం                 శ్రీమతి రాఘవ రాజ్యలక్ష్మిగారు                                                    సుభాషితములు

30-5-25                  శుక్రవారం                  శ్రీ మరిగంటి లక్ష్మణాచార్యులు గారు                                            నా జీవితంలో సత్యసాయిబాబ

31-5-25                   శనివారం                   మారతహళ్ళి బాలవికాస సమితి కార్యక్రమము