Satsang AECS

ఏప్రిల్ దినసరి కార్యక్రమములు

తేది                                 వారము                            వక్తపేరు                                                  విషయము

1-4-25                     మంగళవారం              శ్రీ బద్రీరాం గారు                            భారతము

2-4-25                    బుధవారం                  శ్రీమతి కళావతి గారు                       విష్ణుసహస్రనామాలు

త్రిసామా  సామగస్సామా … అనే శ్లోకం నుండి శ్రీవత్స వక్షాశ్రీవాసః — అనే శ్లోకం వరకూ గల నామాల అర్థాలకు ఆధ్యాత్మిక ,ఆధిభౌతిక ,ఆధిదైవిక పరంగా  చక్కటి వివరణ ఇచ్చారు

3-4-25                    గురువారం                   ఆధ్యాత్మిక సదస్సు – మొదటి సమూహం

విషయం — షట్చక్రవర్తులు, షోడశ మహారాజులు

  1. శ్రీ గోపాల రెడ్డి గారు- నలమహారాజు
  2. ⁠శ్రీమతి లక్ష్మీ వేదుల- మాంధాత
  3. ⁠శ్రీ యాదగిరి స్వామి గారు – పృథు చక్రవర్తి
  4. ⁠శ్రీమతి అనూరాధ గారు – పరశురాముడి
  5. ⁠శ్రీ జోగారావు గారు- అంబరీషుని
  6. ⁠శ్రీమతి రమణి గారు – మరుత్తు మహారాజు

4.4.2025                 శుక్రవారం                     శ్రీ ఉమా మహేశ్వర రావు గారు            పురాణ పరిచయం

 పద్మ పురాణం పరిచయం, ఈ పద్మ పురాణం లోని శ్లోకాల సంఖ్య -55,000 – ⁠దీనిలో (1)భూమి ఖండము,ఆది ఖండము, సృష్టి ఖండము, బ్రహ్మ ఖండము, ఉత్తర ఖండము, జ్ఞాన ఖండము అనే 6 ఖండాలు ఉన్నాయి – ⁠ఈ పురాణములో అనేక మహిమలు, ముఖ్యముగా గురుమహిమలు వర్ణించబడ్డాయి – ⁠సోమదత్తుని కథ- ⁠

రెండవ వక్త : శ్రీమతి కృష్ణవేణి గారు  ,వాగ్గేయకారుల కీర్తనల పరిచయం -అన్నమాచార్య కీర్తన

5.04.2025               శనివారం                     శ్రీ రామనవమి విశేష కార్యక్రమం

  1.            శ్రీ విశ్వకిరణ్ గారు — వేణుగానం — సీతారామ కళ్యాణము చూతము రారండీ
  2.           ⁠ సత్య ఉపద్రష్ట — ప్రార్థనా గీతం—పలుకే బంగారమాయెనా
  3.           ⁠శ్రీ ఉమా మహేశ్వర రావు గారు —ప్రసంగం- గాయత్రి మంత్రం-రామాయణ

                                                                    అనుసంధానం

  1.          ⁠శ్రీమతి అన్నపూర్ణ గారు-సత్యసాయి రామాయణ సందేశం — వీడియో ప్లే
  2.          ⁠సభ్యులచే శ్రీ రామ భక్తి గీతాలు :
  3.          శ్రీమతి కృష్ణవేణి గారు— చల్లారే రామచంద్రుని పై రూలూ … త్యాగరాజు కీర్తన
  4.          శ్రీ శ్రీనివాస రావు గారు— రామా కనవేమిరా …
  5.          శ్రీమతి అనూరాధ గారు— రామ నీలమేఘశ్యామ కోదండ రామా
  6.          శ్రీమతి రమణి గారు— పావన రామ నామ సుధారస
  7.         శ్రీ విద్యా సాగర రావు గారు — అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి
  8.         శ్రీ బదరీ రాం గారు – పురందర దాసు కీర్తన

6-4-25                ఆదివారం                      సెలవు 

7-4-25                సోమవారం                    శ్రీ త్రినాధరెడ్డిగారు                        భగవద్గీత – ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో.

హిందూధర్మంపట్ల ఉన్న రాళ్ళురప్పలను పూజిస్తారు, సృష్టికర్తను వదలి సృష్టిని పూజిస్తారు, బొమ్మలను పూజిస్తారు అనే అపోహలను తొలగించే ప్రయత్నంగా భగవద్గీతా పరంగా వాటి వెనుకనున్న తార్కికతను చర్చించే ప్రయత్నం జరిగింది. అంటరాని తనము, సతీ సహగమనము, బాల్యవివాహాలు

వంటి మూఢాచారాలను మతపరంగా కాక అప్పటి సామాజికపరంగా, భావోద్వేగాలపరంగా చూడవలసిన అవసరాన్ని చర్చించడం జరిగింది. మౌలికంగా సనాతనధర్మం ‘అందరూ ఒక్కటే విశ్వమంతా ఒక్కటే’ అనే ఏకత్వాన్ని ప్రబోధిస్తుందనే సత్యాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. పురాణాలలో శివునిగూర్చి, అయ్యప్పజననాన్ని గురించి, శ్రీ కృష్ణ భగవానుడు స్త్రీలోలుడుగా అన్యమతస్తులచే విమర్శించబడడం గురించి చర్చించి, వాటిని విశ్లేషించి ఆ సూక్ష్మాలను గ్రహించే ప్రయత్నం జరిగింది. మన సనాతనధర్మం హేతుబద్ధమైనదనీ, ఆచరణాత్మకమైనదనీ, వ్యక్తుల పరిణతినీ అవగాహనా సామర్థ్యాన్ని అనుసరించి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలరూపంలో వ్యాసభగవానునిచే వివరించబడిందనీ, జనసామాన్యాన్ని ఆకట్టుకునేందుకు వివరించే విధానంలో ఉత్ప్రేక్షలూ, ఉపమానాలు, అద్భుతాలు జొప్పించబడి ఉంటాయనీ, సారాన్ని సందేశాన్ని గ్రహించడం ముఖ్యమనే విషయాలను చర్చించడం జరిగింది.

8-4.2025              మంగళవారం              శ్రీ బద్రీరాం గారు                               భారతము

రోమస మహర్షి ధర్మరాజు కు అగస్త్యుడు గొప్పతనాన్ని గురించి చెపుతూ అగస్త్యుడు దక్షిణ భారత దేశ యాత్రలో శ్రీశైలం, శ్రీకాళహస్తి,  క్షేత్రముల గురించి చెప్పారు.ఇంద్రద్యుమ్నుడు తపస్సులో ఉండి తనను గౌరవించలేదని మరుజన్మలో ఏనుగు గా జన్మించి గజేంద్రునిగా మోక్షం పొందుతారని చెప్పారు. కబేరుడు ముక్తి పొందిన  విషయాన్ని కూడా చెప్పారు. కావేరి నది ఆవిర్భావం గురించి చెప్పారు. గంధర్వ రాజు మణికంటుని వృత్తాంతం కూడా చెప్పారు. అగస్త్యుడు కరవీరపురం చేరి లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది మరుజన్మలో వేదవ్యాసుడుగా జన్మించి లోకోపకారం జరిగిన వృత్తాంతం చెప్పారు.

9-4-25                  బుధవారం                   శ్రీమతి కళావతి గారు                          విష్ణుసహస్రనామాలు

10-4-25                 గురువారం                  ఆధ్యాత్మికసదస్సు                               రెండవ సమూహం

                               1) శ్రీ శ్రీనివాసులు గుప్తా గారు:    – మాగంటి అన్నపూర్ణాదేవి

                               2) శ్రీమతి నైనావతి గారు          –  శ్రీమతి ఇందిరాగాంధీశ్రీమతి ఆనందం మయి 

                               3) శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు     –   గురు బ్రహ్మ 

                               4) శ్రీమతి అన్నపూర్ణ గారు        –  మౌనం ,  కథానిక

                               5) శ్రీమతి రమణి గారు            –   ఏడుకొండల వారి మీద పాటు

                               6) శ్రీమతి అనురాధ గారు          – ప్రణవం 

                               7) శ్రీ విద్యాసాగర్ రావు గారు       –  శ్రకృష్ణ దేవరాయలు చిన్న కథానిక

                               8) శ్రీ విజయ సింహ గారు           –  కథానిక

11-4-25                  శుక్రవారం                       శ్రీ ఉమామహేశ్వరరావు గారు              పురాణసాహిత్యం         

12-4-25                 శనివారం                        శ్రీ వి.యస.శర్మ గారు                           భాగవతం

బ్రహ్మ సృష్టి నీఏ విధంగా చెయ్యలో తెలియక ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆయన వలన  జ్ఞానం పొంది చాలా సంతోషంగా మళ్ళీ లోక హితం గురించి  తపస్సు చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో ఆయన ప్రధమ కుమారు డు అయినా నారద మహర్షి వచ్చి తండ్రి భగవంతుని మాయ ఎలా ఉంటుందో నాకు తెలియాలని అనిపించింది మీరు నాకు వివరించవలసింది అని అడగడం జరిగింది సుఖ మహర్షి పరీక్షిత మహారాజుతో నీసందేహమే నారద మహర్షికి కూడా కలిగింది. బ్రహ్మ నారదుడికి ఈ విధంగా చెప్తున్నాడు నీకు సులభంగా అర్థం కావడానికి భాగవతం అనే పురాణం ఉంది నువ్వు వింటే నీకు మాయ తత్వం అర్థమవుతుంది ఈ భాగవతం నాలుగు శ్లోకాలతో 10 లక్షణాలతో సంగ్రహంగా ఉంది. పది లక్షణాలు ఏవి అంటే స్వర్గం విసర్గం స్థానం పోషణం  ఊతులు మన్మంతరాలు ఈశాన చరితులు నిరోధం ముక్తి ఆశ్రయం అనేవి. పదవ లక్షణం అయిన ఆశ్రయము మే బ్రహ్మం. ఇలాగా ఈ లక్షణాలన్నిటినీ వివరించి ఆయనకి మాయ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది. ఉత్పత్తి స్థితిలయాలు అనేవి ఎక్కడ జరుగుతాయో దానిని ఆశ్రయం అంటారు అదే పరమాత్మ బ్రహ్మ శబ్దంతో  చెప్పబడేది అదే.  దానిని ప్రత్యక్ష అనుభవంతో తెలియజేయడానికి ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మొదలైన విభాగం చెప్పబడింది

13-4-25                 ఆదివారం                      సెలవు 

14-4-25                సోమవారం                    శ్రీ త్రినాధరెడ్డి గారు                               ఆధునిక శాస్త్రీయ మరియు

వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో.

భగవద్గీతా పరంగా ‘సైన్స్ మరియు ఆధ్యాత్మికత – సిద్ధాంతీకరణలో వాటి సారూప్యత’ అనే అంశాన్ని చర్చించడం జరిగింది. సిద్దాంతీకరణలో సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండింటి విధానము ఒకటేననీ, పరిగణన, పరిశీలన, చర్చల ఆధారంగానే, హేతుబద్ధంగానే సిద్ధాంతీకరణ జరుగుతుందనీ, ఆధ్యాత్మికత మూఢనమ్మకాలపై ఆధారపడి ఉంటుందనేది అపోహఅనీ, అవగాహనా రాహిత్యమనీ చర్చించడం జరిగింది. సైన్స్ కూడా ‘పాస్ట్యులేట్స్’ అనగా ఊహాజనిత ప్రతిపాదనల ఆధారంగానే అనుభవానికి వచ్చిన విషయాన్ని వివరిస్తుందనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెంటిలోనూ క్రొత్తవిషయాలు అనుభవానికి వచ్చినప్పుడు సిద్ధాంతాలు మారతాయనే విషయాన్ని చర్చించడం జరిగింది.

15-4-25              మంగళవారం                  శ్రీ బద్రీరాం గారు                                     భారతము

విశ్వామిత్రుని చెల్లెలు కౌశికీ యే కౌశికీ  నదిగా ప్రవహిస్తున్నది. కశ్యపుని పుత్రడు- విభాండకుడు, విభాండకుడి పుత్రుడైన ఋష్యశృంగుని గురించి తెలిపారు

16-4-25              బుధవారం                      శ్రీమతి రమణి గారు                                  ముకుందమాల

9 వ శ్లోకం నుంచి 13 శ్లోకాల వరకు -5 శ్లోకాల యొక్క భావాలను ప్రతి పదార్థ సహితంగా వివరించారు

తదుపరి శ్రీమతి భారతి గారు “శిఖరం “ అనే కథానికను వినిపించారు

17-4-25                గురువారం                      ఆధ్యాత్మిక సదస్సు                                  మూడవసమూహం

                                                                      విషయం: దేవతలువాహనాలు-వైశిష్యము

  1. శ్రీమతి అన్నపూర్నగారు – మానసాదేవి-సర్పం
  2. శ్రీమతి కృష్ణవేణి గారు – గంగాదేవి – మకరం
  3. శ్రీమాతి కళావతి గారు – లలితాదేవి – వరాహం
  4. శ్రీ విజాయాసింహ గారు – శనిదేవుడు – కాకి
  5. శ్రీ సాయిబాబా గారు – అయ్యప్పస్వామి – పులి
  6. శ్రీ యన్ .వి.యస్ చెట్టి గారు – సూర్యుడు – అశ్వం
  7. శ్రీ చిదానందమూర్తి గారు – యముడు – మహిషం

18-4-25              శుక్రవారం                    శ్రీ ఉమా మహేశ్వర రావు గారు   పద్మ పురాణం

పునశ్చరణ ,యాత్రలకు వెళ్ళునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు , యాత్రా సమయంలో గురువు యొక్క ఆవశ్యకత, గురువాజ్ఞ ను పాటించకపోయినందు వల్ల కలిగే పర్యవసానం,పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల కలిగే ప్రయోజనాలు,యాత్ర చేయడం సాధనలో ఒక భాగం,కార్తవీర్యార్జునుడు పాలించిన మాహిష్మతీ నగరం యొక్క వైశిష్ట్యం ,శ్రీ మహాలక్ష్మి , శ్రీ మహావిష్ణువు ల వియోగం , హయహయుని జనననం,హయహయుని కుమారుడైన కృతవర్మ , కృతవర్మ కుమారుడు   అయిన కార్తవీర్యార్జునుని చరిత్ర, కార్తవీర్యార్జునుని దత్తాత్రేయస్వామి అనుగ్రహించడం – మొదలైన విషయాలను తమ ప్రసంగంలో ఎంతో హృద్యంగా వివరించారు.

19-4-25              శనివారం                   శ్రీమతి కళావతి గారు                           విష్ణు సహస్ర నామాలు

633 వ నామం “అర్చిష్మాన్” నుంచి 653 వ నామం “కామీః” వరకు గల నామాల అర్ధాలు వివిధ ఉపమానాలు , ఉదాహరణలతో సభ్యులందరినీ ఆకట్టుకునేలా సరళ భాషలో వివరించారు. శ్రీమతి రమణి గారు శ్రీమతి కళావతి గారికి చేసిన వందన సమర్పణతో ఈ నాటి సత్సంగ కార్యక్రమం , హరి నామ స్మరణానంతరం ముగిసినది

20-4-25             ఆదివారం                  సెలవు 

21-4-25              సోమవారం                 శ్రీ O.V.S. రమణ మూర్తి గారు,               ఈశవాశ్యఉపనిషత్తు

 శాంతి మంత్రం అందరిచే పలికించి,  ఆ మంత్రం గురించి వివరిస్తూ, అది పూర్ణం, ఇది కూడా పూర్ణం,  పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది. తరువాత మొదటి శ్లోకం గురించి వివరిస్తూ ఈ జగత్తులో మార్పు చెందేది ఏమి ఉన్నవో అదంతా భగవంతుని చేత  ఆవరింపబడి వుంది. త్యాగం చేత నిన్ను నువ్వు పోషించుకో, ఎవరి ధనాన్ని ఆశించకు అని చెప్పారు.

రెండవ శ్లోకం గురించి వివరిస్తూ శాస్త్ర విహితమైన నైమిత్తిక  కర్మలు ఆచరిస్తూ మానవుడు నూరు సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. మానవ జీవితం పైన ఆసక్తి ఉన్నంతవరకు  దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ముగించారు, శ్రీ యాదగిరి స్వామి, ప్రేమ, అన్నపూర్ణ వారి వందన సమర్పణతో సత్సంగ కార్యక్రమం ముగిసింది

22-4-25          మంగళవారం               శ్రీ భద్రీరాం గారు                                 

మహాభారతo  విభాండకుడు , వారి కుమారుడు ఋష్యశృంగుడు గురించి చెపుతూ, అంగ రాజ్యములో కరువు కాటకములతో ఉండగా ఋష్యశృంగుడిని అంగ రాజ్యములో అడుగు పెట్టేటట్లు చేసి అంగ రాజ్యము సస్యశ్యామలంగా అవడం, రాజు తన కూతురు అయిన శాంతదేవిని ఇచ్చి వివాహం చేశాడు. తరువాత పాండవులు కౌశికి నదిలో స్నానమాచరించగా ధర్మరాజుకు సమస్త లోకాలు, వేదఘో షలు వినపడ్డాయి. తరువాత విశ్వకర్మ యజ్ఞము చేసి దక్షిణ భూభాగమతయు కశ్యపునికి దానమిచ్చాడు, భూదేవి కశ్యపుని కరుణించి అరుగు రూపం పొంది, ఎవరైతే మంత్రజపంతో అరుగు ఎక్కిన వారు పరాక్రమ వంతులైతారు అని చెప్పగా పాండవులందరూ ఆ  అరుగు ఎక్కి మహేంద్ర పర్వతమునకు పోయి పరుశురాముడు గురించి ప్రవణుడు అనే మునీంద్రుడిని అడిగారు. రుచికుడు గాధి రాజు కూతురు సత్యవతిని వివాహమాడుట గురించి చెపుతూ ఆమె తండ్రి కోరిక మేరకు వెయ్యి గుఱ్ఱములను వరుణుని కరుణతో కన్యాకుబ్జము అను పురమందు పుట్టగా, వాటిని గాధి రాజుకు ఇచ్చి సత్యవతిని వివాహమాడెను. బృగు మహర్షి సంతోషముగా వరము కోరుకోమనగా నాకు మా తల్లికి కొడుకును కోరగా నీవు బ్రాహ్మణ కాంతవు నీ కొడుకు క్షత్రియుల తేజస్సుతో  రాజులను సంహరిస్తాడు, మీ అమ్మకు పుట్టే కొడుకు బ్రాహ్మణత్వం పొందుతాడు,  అనగా నాకు మనుమడు క్షాత్ర తేజస్సుతో కావలెను అని కోరగా జమదగ్ని గా పుడతాడు అని చెప్పారు.

23-4-25        బుధవారం                 శ్రీమతి  రమణిగారు                 ముకుందమాలాస్తోత్రము

పునశ్చరణ : 1 నుంచి 12 శ్లోకాల భావ వివరణ సంక్షిప్తంగా

13 వశ్లోకం నుండి 17 వ శ్లోకం వరకు  తాత్పర్య సహితంగా భావార్థాలను శ్రీ కులశేఖరాళ్వారులు వివరించిన భక్తి భావాలను విశదీకరంచారు

24-4-25        గురువారం                 ఆధ్యాత్మికసదస్సు                  నాల్గవ సము

 గగనతలంలో ఆరాధ్య  దేవతలు :  ధ్రువుడు, సప్తఋషులు, నవగ్రహాలు.

  1. శ్రీమతి ప్రేమాకుమారి గారు.  – భరద్వాజ మహర్షి.
  2. శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు.   – విశ్వామిత్ర  మహర్షి.
  3. శ్రీమతి శారదా సరిపల్లి గారు. –  అంగీరస మహర్షి.
  4. శ్రీ విద్యాసాగర్ రావు గారు. –   నవగ్రహాలు :
  5. శ్రీ గద్వాల విశ్వ కిరణ్ గారు.  –   గగనతలం విశేషాలు- శాస్త్రీయ పరిశీలన:

25-4-25        శుక్రవారం                  శ్రీమతి అన్నపూర్ణగారు             నారాయణీయం

నారాయణీయం మొదటి దశకంలోని 1,2,3 శ్లోకాలు పునశ్చరణ చేసి నాల్గవ శ్లోకంలో పరమాత్మను సముద్రంతో , 6 శ్లోకంలో లక్ష్మీదేవి శరీరం అంతాశోభాయమానంగా వ్యాపించిన విధం,7 వ శ్లోకంలో ఇంద్రియాలు ఉండటం వల్ల పరమాత్మను పూజించగల్గుతున్నానని,8 వ శ్లోకం లోకల్పవృక్షంతౌ పోల్చిన విధానాన్ని వివరించారు. 

26-4-25        శనివారం                   శ్రీ గోపీకృష్ణగారు                     విశేషకార్యక్రమము

                    శ్రి సత్యశాయిబాబాగారి గురించి వారి స్వీయ అనుభవాలు వివరించారు

27-4-25         ఆదివారం                  సెలవు 

28-4-25        సోమవారం                 శ్రీ రమణమూర్తిగారు                ఈశావాశ్య ఉపనిషత్తు

శాంతి మంత్రముతో ప్రారంభించి ఈశావాశ్య ఉపనిషత్తు లోని మొదటి మూడు శ్లోకములను వివరించారు

29-4-25        మంగళవారం              శ్రీ బద్రీరాంగారు                      మహాభారతం

కార్తవీర్యార్జునుని చరిత్ర  జమదగ్ని మహర్షి ఆశ్రమం లో ఉన్న కామధేనువును అపహరించడం , జమదగ్ని కుమారుడైన పరశురాముడు కార్తవీర్యునివధించడం ,కార్తవీర్యుని పుత్రులు జమదగ్నిని చంపడంతో జమదగ్ని ధర్మపత్ని 21 సార్లు గుండె బాదుకుని విలపించినందువల్ల వారి కుమారుడైన పరశురాముడు 21 మార్లు భూమండలం మొత్తం పర్యటించి దుష్టులైన రాజులనందరినీ హతమార్చడం వివరించారు

30-4-25        బుధవారం                 శ్రీమతి రమణిగారు                  ముకుందమాలాస్తోత్రం

పునశ్చరణ : 1 వ శ్లోకం నుండి 17 శ్లోకాలను చదివి , వాటి భావాలకు సంక్షిప్త వివరణ

ప్రస్తుతం : 18 వశ్లోకంలోని నారాయణ మంత్ర మహిమను  తెలియ చేశారు

19 వశ్లోకం లో స్వామి యొక్క మహిమ, వైభవం , గొప్పతనం వర్ణన ,20 వ శ్లోకం లోని భావం- మానవుని జీవితం ఎలా ఉండాలో శ్రీ కులశేఖరాళ్వారులు తెలిపిన విధం, 21 వ శ్లోకంలో భగవంతుని శరణాగతి,22వశ్లోకం లోభగవంతుడు భక్తునికి ఎన్ని విధాలుగా సహాయపడుతాడో వివరించడం, 23 వశ్లోకంలోసంసారసాగర తరణానికి మానవులు జపించవలసిన భగవత్ నామ మంత్రం గురించి వివరించారు