1-11-24 శుక్రవారం
కె.ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం
వెబ్ సైట్ ఆవిష్కరణ – శ్రీమతి అఖిల ప్రార్ధన గీతం తో ఆవిష్కరణ కార్యక్రమము మొదలయినది శ్రీమతి అన్నపూర్ణ గారు వెబసైట్ ఆవశ్యకత ,
ఉపయోగాల గురించి మాట్లాడారు.తదుపరి శ్రి ఉమామహేసఅరరావు గారు వెబ్ సైట్ లాంఛనంగా ఆవిష్కరించి, స్వాగతోపన్యాసము చేశారు
శ్రీ వంశికృక్ష్ణ గారు వెబ్ సైట్ గురించి ఏవిధంగా దానిని ఉపయోగించాలో వివరించారు.
శ్రీ రమణమూర్తి గారు సభ్యుల సందేహాలను,సూచనలను ఆహ్వానించారు, సభ్యులందరు ఉత్సాహముగా వారి అభిప్రాయములను వెలిబుచ్చారు.
తరువాత వందన సమర్పణ గావించారు
2-11-24 శనివారము
శ్రీ శ్రీనివాసా మూర్తి గారు – అరుణాచల వైభవం – I
అరుణాచలంలో మామూలుగా వుండేది శివలింగమే మరి అగ్ని లింగం అని ఎందుకు అంటారు.అసలు యధార్థముగా అది జ్ఞానాగ్ని , అది కలిగిన
వారి కర్మలు దగ్ధమవుతాయి. ,”ఙ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం” అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అంత గొప్ప జ్ఞాన స్వరూపమే రాశీభూత్తమై లింగ
స్వరూపాన్ని దాల్చింది. అరుణాచలంలో శివుడు మూడు రూపాలలో వుంటాడు. ఒకటి శివలింగం, రెండు కొండ కొండ అంతా శివ స్వరూపం, అగ్ని
స్వరూపం, మూడవది పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మర్రిచెట్టు క్రింద వుంటారని, ఎందరో సిద్దులు, యోగులు, దేవతలు దక్షిణామూర్తిని
దర్శించుకుంటారని ప్రతీతి. అరుణాచలంలో శివుడు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అపీతకుఛాంబ. అరుణాచలంలో మూడు ఉత్సవాలు
జరుగుతాయి. ఒకటి అమ్మవారికి గాజుల సమర్పణ రెండవది కార్తీక దీపోత్సవం మూడవది పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయ కలహోత్సవం.
3-11-24 ఆదివారం – సెలవు
4-11-24 సోమవారం
శ్రీ త్రినాధరెడ్డి గారు – భగవద్గీత – యువతకు ఆదర్శం
భగవద్గీత”-ఆదునిక శాస్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టి కోణంలో “ అనే విషయంలో భాగంగా మన మహర్షులు నిర్వచించిన చక్రాలు మరియు
ధ్యాన ప్రక్రియలకు ఆధునిక మానవ శరీర నిర్మాణ శాస్త్రంతో అనుసంధానం చేసే ప్రయత్నం చేయడం జరిగింది.శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో
ప్రవచించిన ధ్యాన ఫలితాలు మానవ నిర్మాణ శాస్త్రం ప్రకారం సాధ్యమే అన్న అంశాన్ని చర్చించడం జరిగింది.మానవ శరీర నిర్మాణ శాస్త్రం
ప్రకారం ఆజ్ఞాచక్రం యొక్క విశిష్ఠతను వివరించే ప్రయత్నం జరిగింది.
5-11-24 మంగళవారం
శ్రీ శ్రీనివాస మూర్తి గారు – అరుణాచల వైభవం – II
పరమేశ్వరుడు గౌతమ మహర్షి కి సాక్షాత్కరించి , అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణం అత్యంత ప్రధానమైన ప్రముఖమైన విషయంగా నిర్దారణ చేసి
నందువలన గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టమైన ప్రాధాన్యత కలిగివున్నది. ప్రదక్షిణ మార్గంలో ఇంచుమించు 100 దేవాలయాలు, 400 శివలింగాలు,
360 తీర్థాలు వున్నాయి. ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్పాలకులచే ప్రతిష్టించిన బడిన లింగాలు వారి వారి పేర్లతో పూజలు అందుకొంటున్నాయి.
భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెళితే రెండు మూడు రోజులు చేసేవారు.కృతికా దీపోత్సవం రూపంలో జ్యోతి దర్శనమే కాదు, ఎన్నో జ్యోతులు,
ఎందరో గురువులు, ఆచార్య పురుషులు, మహాపురుషులు అరుణాచలం అనబడే ఆ పరమశివుని చేత ఆకర్షింపబడి అక్కడ నివాసం చేసి
మనందరినీ కూడా తరింప చేస్తున్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ.
6-11-24 బుధవారం – శ్రీమతి అరుణ గారు వాల్మీకి రామాయణం – సుందరకాండ
హనుమ లంకా దహనం చేసినందువలన సీతమ్మకి హాని జరిగిందేమొ అని భావించి భయాందోళన చెంది ఆమె క్షేమంగా ఉన్నందున
ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు హనుమ . తన భర్త కి చూడామణి ని అందించమని హనుమకి ఇచ్చి త్వరగా లంక చేరి ఆమెను
కాపాడాల్సినదని కోరిందని శ్రీరామునికి సందేశం పంపింది.హనుమ లంక నుండి వెనక్కి వానరుల దగ్గరకి చేరుకున్న తర్వాత తను
సముద్రం లంఘించిన దగ్గర నుండి వెనక్కి వచ్చిన వరకూ పూసగుచ్చిన విధంగా వివరించాడు.
7-11-24 గురువారం
ఆధ్యాత్మిక సదస్సు – మొదటి సమూహము
8-11-24 శుక్రవారం
శ్రీ కె.ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం
వరాహపురాణము – మొదటి ఉపన్యాసము .
మత్స్య, కూర్మ,వరాహ మరియు వామన పురాణములు విష్ణు పురాణములుగా చెప్పబడినవి. 24,000 శ్లోకములు కలిగిన వరాహ పురాణము
సనక సనందనాదులు విష్ణు దర్శనార్థము వైకుంఠము చేరుట, జయవిజయులు వారిని అడ్డగించుట, వారు మూడు జన్మలవరకు రాక్షస
జన్మనొందు విధముగా శాపగ్రస్తులగుట, ఆ తరువాత కశ్యప ప్రజాపతి, దితి దంపతులకు హిరణ్య కశిపు-హిరణ్యాక్ష కవల పుత్రులుగా జన్మించుట
వరకు వివరించబడినది.
9-11-24 శనివారం
శ్రీమతి కళావతి గారు – శతక-సూక్త సాహిత్యం
సరళమైనపదాలతో ఆనంత భావాన్నిఅత్యధ్భుత సాహిత్యాన్ని నింవబడినవి శతకములు.ఈ శతకముల పద్యాలు చిన్నప్పడు చాలా కంఠస్తం
చేసేవాళ్ళం మనం. సూక్తములు వేదసాహిత్యం. కఠినమైన సంస్రృత భాషలో ఉన్నప్పటకి గంభీర భావాలను, వేదాంత తత్వాలను నింపి
వేదవ్యాసుడు వ్రాశాడు.అందులోని విష్ణు సూక్తం చాలా బాగుంటుంది,దీనినే సంక్షిప్త మంత్ర పుష్పం అనికూడా అంటారు.ఇందులోనున్న విశేషం
ఏమిటంటే సహస్రాక్షుడు ,సర్వాంతర్యామి అయిన నారాయణుడు నీ హృదయంలోనే విరాజమానుడై ఉన్నాడని ఈ విష్ణు సూక్తంలో చెప్పబడింది.
ఆ విధంగా మన హృదయంలోనే భగవంతుని ధ్యానిస్తే మనిషి మోక్షాన్ని పొందగలడు అని ఈ నారాయణ సూక్తంలో వ్రాయబడి ఉన్నది . శ్రేష్ఠమైన
ధాన్యపు గింజ ఏంత చిన్నగా ఉంటుందో మన శరిరంలో నాభికి పైగా హృదయానికి క్రిందగా జ్యోతి స్వరూపంలో నారాయణుడు ఆత్మశక్తి రూపంలో
ఉన్నాడు. ఆ ఆత్మశక్తి వలననే ఈ శరీరం వేడిగా ఉన్నది. అక్కడ అంటే మానవుని హృదయంలో ఉండే జ్యోతి స్వరూపుడైన నారాయణుని ధ్యానించే
వాడు శాశ్వత ఆత్మానందాన్ని పొందుతాడు. మనిషి అమృత తత్వాన్ని పొందడాసనికి నారాయణ భజన, ధ్యానము వినా మరొక దారిలేదు. అందరూ
నారాయణ నామజపం చేసి తరించాలని కోరుకుంటూ కృష్ణార్పణమస్తు.
10-11-234 అదివారం– సెలవు
11-11-24 సౌమవారం
శ్రీ త్రినాధరెడ్డి గారు – భగవద్గీత – యువతకు ఆదర్శం
భగవద్గీత”-ఆదునిక శాస్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టి కోణంలో “ అనే విషయంలో భాగంగా మంత్ర జపం చేసే టప్పుడు మంత్రంలోని
బీజాక్షరాల ఉచ్చారణ కారణంగా కలిగే ప్రకంపనలు అంతర అవయవాలను మసాజ్ చేసే అవకాశం ఉందని తన్మూలంగా అంతర
అవయవాల ఆరోగ్యం మెరుగు పడే ఆవకాశము , ప్రశాంతత లభించే అవకాశము ఉన్నాయనే విషయాన్ని చర్చించటం జరిగింది. విఠల విఠల
నామ జపంతో బి పి నియంత్రించ బఉతుందని, హార్ట్ యటాక్ వంటి ప్రమాదాలు నివారించబడతాయనే విషయం శాస్త్రీయంగా ఋజువు
చేయబడిందనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది.
12-11-24 మంగళ వారం
శ్రీ వి.యస. శర్మ గారు – శ్రి మహాభాగవతం
భాగవతాన్ని చదవడం ద్వారా సర్వ పాపములు నశించి ముక్తిని ప్రసాదిస్తుంది. అరణ్యాలు అన్నిటిలోకి నైమిశారణ్యం శ్రేష్టమైనది అక్కడ అనేక
మంది ఋషులు నిత్యము తపస్సు చేసుకుంటూ హరినామంలోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు. వారికి ఒకసారి శత్ర యోగం చేయాలని
అనిపించింది. సూత మహాముని ఈ యజ్ఞాన్ని చేయడానికి అంగీకరించాడు. అప్పుడు మిగతా ఋషులందరూ కూడా సూత మునిని ఈ
విధంగా ప్రశ్నిస్తున్నారు. అయ్యా కలియుగంలో మానవులు అల్పాయుష్కులై అనేక విధమైనటువంటి రోగాలతో మందబుద్ధులై ఉంటారు వారు ఏ
విధముగా ఉద్ధరించబడతారు. అని ప్రశ్నించగా శూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ కలియుగంలో హరినామ సంకీర్తన వలన మనుషులు
ఉద్ధరించబడతారు. తదుపరి ఆయన భగవంతుని ఇరవై ఒక్క అవతారాలను చెప్పడం జరిగింది. సాధారణంగా భగవంతుని 10
అవతారాలుగా తీసుకుంటాం అంటే దశావతారాలని మనం చెప్తాం. ఇక్కడ సూత మహామని మరికొన్నిటీని కూడా వారికి చెప్పి మొత్తం 21
అవతారాలుగా చెప్పడం జరిగింది. అవి ఎలాగంటే ఒకటి దేవదేవుని మొదటి అవతారమే నారాయణమూర్తి రెండవది వరాహవతారం మూడవది
నారదుడు నాలుగోది నర నారాయణులు ఐదవది కపిల మహర్షి, ఆరవది దత్తాత్రేయుడు, ఏడవది యజ్ఞుడు , ఎనిమిదవ అవతారం
పురుక్రముడు తొమ్మిదవది పృదుచక్రవర్తి,పదవ ది మచ్చ అవతారము, 11 కూర్మా అవుతారు, 12 ధన్వంతరి అవుతారం మిగతా తొమ్మిది అవతారాలను
నేను స్థలభావము వలన ప్రస్తావించటం లేదు ఈ మొత్తం విషయాలన్నిటినీ కూడా చెప్పినటువంటిది భాగవతం వ్యాస మహర్షి
చింతాక్రాంతుడై ఉన్నప్పుడు నారద మహర్షి ఆయనకి భగవద్విశేషాలను రాయవలసిందని సలహా ఇవ్వడం జరిగింది.
13-11-245 బుధవారం
శ్రీ శ్రీనివాసమూర్తి గారు – శ్రీకృష్ణ జననం
శ్రీ కృష్ణ జననం
శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంగా చెరసాలలో జన్మించాడు. మామ కoసుడికి అష్టమ గర్భంలో పుట్టినవాడు సంహరిస్తాడని
అశరీరవాణి ఆకాశమునుండి పలికినందువలన ఎక్కడ కంసుడు వచ్చి బాలుణ్ణి సంహరిస్థాడని వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి
సంకల్పం వలన గ్రహించి శ్రీకృష్ణుని పురిటి ఇల్లు దాటించాడు. హరి మాయ వలన బంధించిన ఇనుప గొలుసులు ఊడిపోయాయి. ద్వారాలు
వాటంతకు అవే తెరుచుకున్నాయి..అలా వెళుతుంటే యమునా నది అడ్డు వచ్చింది. పూర్వం శ్రీరాముడికి సముద్రం దారి ఇచ్చినట్లు, యమునా నది
వసుదేవునకు దారి ఇచ్చింది.అదే సమయానికి వ్రేపల్లెలో నందుని భార్య యశోధకు ఆడుబిడ్డగా యోగమాయ జన్మించింది. వ్రేపల్లెలో అందరినీ
ఒక చిత్రమైన మైకం ఆవరించింది.వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరి యశోద ప్రక్కన నల్లనయ్యను పడుకోబెట్టి ప్రక్కన వున్న ఆమె
కుమార్తెను తీసికొనివచ్చి చిన్నిపాపను దేవకీ ప్రక్కలో మెల్లగా పడుకోబెట్టాడు.. వెంటనే చిన్నిపాప కెవ్వున ఏడ్చింది. ఆ శబ్దం విని కావలిభటులు కంస
రాజుకు తెలియచేశారు.కంసుడు వెంటనే కారాగారానికి వచ్చి కన్నుగానని కావరంతో ఆ చిట్టిపాపను కాళ్ళు పట్టుకొని విసిరి నేలపైన కొట్టాడు. ఆ పాప
రివ్వున ఆకాశానికి ఎగిరిపోయి ఎనిమిది చేతులతో వెలిగిపోయింది.మహకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను ఆరుగురిని వదించావు, అంతటితో
శాంతించక పసిబిడ్డను రాతిమీద కొట్టి చంపడానికి పూనుకొన్నావు, ఛీ ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొక్కడు నాతోపాటే జన్మించి మరో
దిక్కున మహా గౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే అని పలికి అదృష్యమైనది. ఇదిలా వుండగా అక్కడ వ్రేపల్లెలో నందుని ఇంట
శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల చేత స్వస్తి వాచకాలు, శుభాశీస్సులు, పుణ్యహవచనలు చేయించాడు, దీర్ఘాయుష్మంతుడు కాగలడని బ్రాహ్మణులు దీవించారు.
14-11-24 గురువారం
ఆధ్యాత్మిక సదస్సు – రెండవ సమూహము
15-11-24 శుక్రవారం
కార్తిక పౌర్ణమి సంధర్భంగా శ్రీ శ్రీనివాసమూర్తి గారు,
శ్రీ విద్యాసాగర్ గారు -ఈశ్వరార్చన,రుద్ర పఠనం
శ్రీ ఉమామహేస్వర రావు గారు – వరాహ పురాణం
16-11-24 సెలవు
17-11-24 ఆదివారం సెలవు
18-11-24 శ్రి త్రినాధరెడ్డి గారు – భగవద్గీత – యువతకు ఆదర్శం
భగవద్గీత”-ఆదునిక శాస్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టి కోణంలో “ అనే విషయంలో భాగంగా సూర్యుని రధం వర్ణనవెనుక నిక్షిప్తమైన ఖగోళ
శాస్త్ర విశేషాలను వివరించే ప్రయత్నం జరిగింది.మన పూర్వీకుల నుండి మనకు వారసత్వంగా లభించిన గ్రంధాలు, ఆచార వ్యవహారాలు
ధ్యానం, యోగా,ప్రాణయామం ,జప తపాలు, సంధ్యావందనాల వెనుక ఎంతో జ్ఞానం నిబిడీకృతమై వున్నదని వాటిని సరిగా అర్ధం చేసుకోకుండా
విధ్యాధికులము, మేధావులము,సంస్కర్తలము అనుకునే మనవారే నిర్లక్షంచేసి, అవహేళన చేస్తూ మూఢాచారాలని కొట్తి పారవేస్తుంటే వాటిని సరిగా
అర్ధం చేసుకొని వాటి వలన నిజంగా లభ్ధి పొందుతున్నది పాశ్చాస్చులు అని వివరించటం జరిగింది. అందుకు ఉచహరణగా పాశ్చాత్యులు రచించిన“ ది
రిలాక్సేషన్ అన్డ్ స్రెస్ రిడక్షన్ వర్క్ బుక్ “ అనే పుస్తకాన్ని యునైటెడ్ స్టేత్స్ లో నిర్వహించ బడుతున్న “ మెడికల్ న్యూస్ టుడే “ అన్న వెబ్ సైట్ ను ,
ఆ వెబ్ సైట్ లో అడ్రినాలిన్ రష్ ను నియంత్రించటానికి వారు సూచించిన మార్గాలను చూపడం జరిగింది.ఏది విజయం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ
లౌకిక విజయాలైన అధికారం, బంగళాలు కార్ల సంపాదన మాత్రమే విజయం కాదని , అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ప్రశాంతత,
అఖండమైన అనంతమైన ఆనందం ముక్తి, మోక్షాలు సాధించటం మాత్రమే అసలైన విజయం కాదని ఆ రెండింటిని సాధించిన వాడే అసలైన
విజయవంతుడని నిస్సంగత్వ మనోభావంతో ఆ రెండింటిని సాధించి చూపిన యోగీశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఆదర్శ పురుషుడని వివరించే
ప్రయత్నం జరిగింది.
19-11-24 మంగళ వారం వి.యస.శర్మ గారు – మహా భాగవతం
20-11-24 బుధవారం – శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామాలు
21-11-24 గురువారం – అధ్యాత్మిక సదస్సు – మూడవ సమూహం
22-11-24 శుక్రవారం – శ్రీ ఉమామహేశ్వర రావు గారు –
పురాణసాహిత్యం
23-11-24 శనివారం – భగవాన్ శ్రీ సత్యశాయిబాబా గారి 99 వ జన్మదినోత్సవం సందర్భంగా విశేష కార్యక్రమమ భజనలు- శ్రీమతి గీత గారు,
శ్రీ శాయిబాబగారు, శ్రీ ఓరుగంటి సూర్య సోమ శంకరు గారు , లఘు ఉపన్యాసములు – శ్రీ తిరుపతయ్య గారు, శ్రీ విశ్వకిరణ్ గారు, శ్రీమతి అరుణ గారు
సమీక్ష – శ్రీ ఉమామహేశ్వర రావు గారు
వందన సమర్పణ – శ్రీ రమణమూర్తి గారు
24-11-24 ఆదివారం – శలవు
25-11-24 సోమవారం – శ్రి త్రినాధరెడ్డి గారు – భగవద్గీత – యువతకు ఆదర్శం
భగవద్గీత-”ఆదునిక శాస్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టి కోణంలో “ అనే విషయంలో భాగంగా
కాలక్రమేణ అవగాహన పెంచుకున్న ఆధునిక భౌతిక శాస్త్రంవిభిన్నంగా వ్యక్తమౌతున్నీఈ జగత్తంతా ఏదో ఒక మూల పదార్ధంనుంచే
ఉత్పన్నమైదనే విషయం వైపే కేంద్రాభిముఖమవుతుందని ,ఆ మూల పదార్ధాన్నేమన పూర్వీకులు బ్రహ్మమన్నారనీ వివరించే ప్రయత్నం జరిగింది.
భగవద్గీతలో పదార్ధము, శక్తి మరియు పనుల యొక్క నిర్వచనాలు దర్శించే ప్రయత్నం, పదార్ధము, శక్తి ఏకత్వ సిధ్ధాంతము దర్శించే ప్రయత్నము
శక్తి మరియు ద్రవ్య రాశుల నిత్యత్వ సిధ్ధాంతాలను దర్శించే ప్రయత్నం జరిగింది.భగవద్గీతలో పరమాత్మనుండి బ్రహ్మము, బ్రహ్మమునుండి శక్తి
మరియు పదార్ధములు వ్యక్తమయ్యాయని చెప్పబడిందనే విషయాన్ని వివరించే ప్రయత్నం జరిగింది.
26-11-24 మంగళవారం – వి.యస.శర్మ గారు – మహా భాగవతం
28-11-24 గురువారం – ఆధ్యాత్మిక సదస్సు – నాల్గవ సమూహం
29-11-24 శుక్రవారం – శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం
30-11-24 శనివారం – విశేష కార్యక్రమము – శ్రీ కాశీ భొట్ల వెంకట సూర్యనారాయణ మూర్తి గారు వక్త,
వారి ప్రసంగములో శ్రీ సత్య సాయిబాబా గారి గూర్చి వివరిస్తూ, వారి కుటుంబము లోని వారి నాన్నమ్మ గారి, బాబా గారి దర్శన అనుగ్రహము, వారి నాన్న
గారు 50 సంవత్సరాలుగా బాబా గారి సేవాదళములో సేవలందిచినది, వారు చదువు పూర్తయిన తరువాత వారు అందించిన సేవలు, బాబా గారు,
అనేక మార్లు, వారిని ఆదుకొని, అనుగ్రహించిన అనుభవాలు, సంఘఠనలు వివరించారు. వారు బాబా గారి గూర్చి వ్రాసిన భజనమాల
శ్రీ సత్య సాయిపబ్లికేషన్స్ ద్వార , ఆడియే కాసెట్ కూడ ప్రచురించబడినది. బాబా గారిని పరబ్రహ్మగా, భగవత్ స్వరూపునిగా అభివర్ణించిన వారి
స్వీయరచన, “బాబా భజన మాల “లోని కొన్ని భజనలు కూడ వారు ఆలపించడము విశేషము. శ్రీ సత్య సాయిబాబా గారి గూర్చి, వారి విశేష
అనుభవాలు పంచుకొని, బాబా గారి అనుగ్రహమునకు పాత్రులయిన, శ్రీ కాచిభొట్ల వేంకట సూర్యనారాయణ మూర్తి గారు ధన్యులు.
.