Satsang AECS

31.08.2024: శనివారం: విశేష కార్యక్రమం - శ్రీ పూర్ణ చందర్ గారి సంగీత విభావరి

విద్వాన్ పూర్ణచందర్ గారు పదహారణాల తెలుగు వారు. చిన్ననాటి నుంచే సంగీతం మీద అభిలాష కలిగిన పూర్ణచందర్ గారు విశ్వవిఖ్యాతకళాకారులైన పద్మభూషణ్ లాల్గుడి జయరామన్ గారి వద్ద వయోలిన్, మరియు పద్మవిభూషణ్ మంగళం పల్లి బాలమురళి గారి ద్వారా సంగీత శిక్షణ పొందారు. దేశవిదేశాలలో ప్రఖ్యాత కళాకారులకు ప్రక్క వాయిద్యముగా వయోలిన్ సహకారం అందించిన ఘనత వారికి దక్కింది. ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసులుగా 25సంవత్సరాలు సేవలందించారు. సినిమా నేపథ్యగాయకులుగా, సంగీత దర్శకులుగా రచయితగా ప్రసిద్ధి పొందిన పూర్ణచందర్ గారు “నాదసుదారస”, “ఆకాశవాణి ప్రథమ శ్రేణి కళాకారులు” అను బిరుదులు పొందినారు. ఆనందభైరవి, శృతిలయలు, మేఘసందేశం లాంటి సినిమాలలో నేపథ్యగాయకులుగా ప్రసిద్ధిగాంచిన వీరు సత్సంగ సభ్యులపై ప్రేమాభిమానాలతో సంగీత విభావరి కార్యక్రమంద్వారా వీరి గానామృతాన్ని సభ్యులకు అందించి అలరించారు.