మన సత్సంగంలో ప్రతి గురువారం ఆధ్యాత్మిక సదస్సు అనే కార్యక్రమమును జరుపుకుంటున్నాము. ఇంతకు ముందు అధ్యయనమండలి అనే పేరుతో జరుపుకునే వారము. ఆధ్యాత్మికము అంటే చాలా సులభంగా అర్థమవడానికి, దైవ చింతన అని చెప్పవచ్చును. దీనిని ప్రేరేపించి వ్యాప్తిచేయడానికై తయారు చేయబడినది ఈ కార్యక్రమము.
ఇందుకు గాను మన సభ్యులందరిని నాలుగు సమూహాలుగా విభజించి, ప్రతి సమూహానికి ఒకరిని ఒకరిని నిర్వాహకునిగా నియమించడం జరిగినది. వారు ఆ సమూహములోని సభ్యులందరితో సంప్రదించి, ప్రతివారు మాట్లాడేలాగ చూడటం, సభ్యులు ఎన్నుకునే విషయంలో సహకరించడం నిర్వాహకుని కర్తవ్యం. ముఖ్యోద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషి లో దాగి ఉన్న వక్తను వెలుపలికి తీసుకొనివచ్చి ప్రతి సభ్యుడు పాల్గొని మాట్లాడేలా చేయడం.
ప్రత్యేక పరిస్థితులలో ఈ కార్యక్రమం గురువారం బదులు మరొకరోజు నిర్వహించ బడుతుంది. అలాగే ఒక సమూహం బదులు మరొక సమూహం పాల్గొనడం జరుగుతుంది.