Satsang AECS

సత్సంగ గీతం

రచన : శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ

పల్లవి: సత్సంగం సత్సంగం సత్యసాయినాథుని ఉత్సంగం 

సాయుజ్యమును సిద్దించే ఆధ్యాత్మిక భక్తి తరంగం

చరణం 1 : పురాణగాథల మేలి సంగమం దైవచింతనకు ప్రతిరూపం 

అశేష భక్తుల పరివారం మోక్షమందిరమునకు ద్వారం 

చరణం 2 : సత్వభావనలకు నిలయం సత్సంకల్పములకు విజయం 

ప్రవచన పరిమళ సంభరితం జ్ఞానాలయము అనవరతం 

చరణం 3 : సాహిత్య చంద్రికల పంచే  భక్తిచంద్రబింబం 

సంగీతరాగమును పెంచే అనురాగవీణాగానం

చరణం 4 : రామాయణ భాగవతముల రమ్యగుణాచరణం 

బ్రాహ్మీదేవీమృదుచరణం భవ్యకళాభరణం 

చరణం 5 : సమస్తలోకా: సుఖినోభవంతు అను వాక్కునకు ప్రతిమానం 

సత్యసాయి వచనామృతసారం ధర్మదేదీప్యమానం 

album-art
00:00