తేది వారము వక్తపేరు విషయము
1-3-25 శనివారం శ్రీమతి కళావతి గారు విష్ణు సహస్ర నామాలు
2-3-25 ఆదివారం సెలవు
3-3-25 సోమవారం శ్రీ.త్రినాధ రెడ్డి గారు భగవద్గీత3-
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో
భగవద్గీతా పరంగా గతజన్మ వాసనలు గురించి చర్చించడం జరిగింది. ఆది శంకరాచార్యులవారి మరియు గణితశాస్త్రంలో అపర మేధావి అయిన రామానుజన్ గారి అద్వితీయ ప్రతిభలకు గతజన్మవాసనలు కారణం కావచ్చనే అంశాన్ని చర్చించడం జరిగింది. జేమ్స్ అనే మూడు ఏండ్ల పిల్లవాడి యొక్క రెండవ ప్రపంచయుద్దకాలంనాటి యుద్దవిమానాలను గూర్చిన పరిజ్ఞానం పునర్జన్మ మరియు గతజన్మవాసనలకు ఋజువు అని పేర్కొనడం జరిగింది. “ఆత్మ ఒక జన్మనుండి మరొక జన్మకు అనుభవ సారాన్ని మోసుకు పోతుంది, ఆ అనుభవానికి తగిన జన్మ లభ్యమౌతుంది. తదుపరి జన్మలో కూడా సాధన కొనసాగుతుంది” అన్న గీతావాక్యాలను చర్చించడం జరిగింది. మరణానికి దగ్గరి అనుభవం (NDE) ఆత్మ, ఆత్మయొక్క నిత్యత్వం, అది అనుభవాలను గ్రహిస్తుందనే గీతావాక్యాలకు సశాస్త్రీయమైన ఋజువు అని పేర్కొనడం జరిగింది.
4-3-25 మంగళవారం శ్రీ బదరీరాం గారు మహా భారతం
5-3-25 బుధవారం శ్రీమతి అన్నపూర్ణ గారు నారాయణీయం -2
మొదటిభాగం పునశ్చరణ,దశకము 1 లోని 1, 2, 3 శ్లోకాల వివరణ
భగవంతుడు,నిర్గుణ,నిరాకార, వేద శాస్త్ర ప్రమాణీకుడని,ఏవిధంగా ఆయనను ఆశ్రయోచాలి అనే విషయం తెలుపబడినది
శ్రీనివాస మూర్తి గారు కధానిక
6-3-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. మొదటి సమూహం
విషయం : షట్చక్రవర్తులు
7-3-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణ సాహిత్యం
8-3-25 శనివారం శ్రీ వి.యస.శర్మ గారు భాగవతం
శ్రీమతి భారతి గారు కధానిక
9-3-25 ఆదివారం సెలవు
10-3-25 సోమవారం శ్రీ రమణ మూర్తిగారు ఈశావాశ్య ఉపనిషత్తు
11-3-25 మంగళవారం శ్రీ బదరీరాం గారు మహా భారతం
రోమస మహర్షి , అగస్త్యుడు నడయాడిన స్థలం కాబట్టి చాలా విశిష్టమైనదిని ,అరుంధతి అగస్యుడికి చేసిన సేవ ,లోపాముద్ర అగస్యుల వివాహము గురిమచి ధర్మరాజుకు చెప్పాడు
12-3-25 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణుసహస్ర నామాలు
విష్ణుసహస్రనామాలలోని 60,61 శ్లోకాలకు వివరణ ఇచ్చారు
శ్రీమతి రమణి కధానిక
13-3-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు – రెండవ సమూహం సమూహం
విషయం.: ఆదర్శమహిళలు
14-3-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు లింగ పురాణం
ప్రసంగించిన విషయాలు : పునశ్చరణ ,లింగోద్భవం,పంచభూత లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ,చల లింగాలు , అచల లింగాలు , శివ లింగ ఆకార వివరణ
శ్రీమతి కృష్ణవేణి గారు తులసిదాసు కీర్తన
15-3-25 శనివారం శ్రీమతి రమణి గారు ముకుందమాలాస్తోత్రం
1,2,3 శ్లోకాల వివరణ
16-3-25 ఆదివారం మెడికల్ క్యాంప్
17-3-25 సోమవారం శ్రీ త్రినాధ రెడ్డో గారు భగవద్గీత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో.
భగవద్గీతా పరంగా క్షేత్రం క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు ప్రతిపాదనల ఆధారంగా ‘నాది… నాది… నాది…’ అనే అంశాన్ని చర్చించడం జరిగింది. ‘ఏదీ నీది కాదు కాదు, ఎవరూ నీ వారు కారు.అనుబంధరహితంగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు’ అన్న గీతావాక్యాల సారాన్ని గ్రహించే ప్రయత్నం జరిగింది. భౌతికశాస్త్రం కూడా “అందరూ ఒక్కటే! విశ్వమంతా ఒక్కటే” అంటుంది అనీ, సైన్స్ కూడా చివరకు ముగిసేది అధ్యాత్మికతలోనే అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.
18-3-25 మంగళవారం శ్రీ బద్రీరాం గారు మహా భారతం
అగస్త్యుడు వింధ్య పర్వతం అహంకారం అణచి దానిని చిన్నగా చేసి దక్షిణ యాత్రలకు బయలుదేరి వెళ్ళాడు, తాను తిరిగి వచ్చే వరకు వేచి చూడమని చెప్పి ఇప్పటికి అలాగే వుoచేశాడు, అరిషడ్వర్గాలను జయించినందువలన మాత్రమే ఈ విధంగా చేయగలిగాడు అని చెప్పారు. తరువాత సముద్రంలో రాత్రి వసించే కాలకేయులను కూడా అగస్త్యుడు సముద్రం నీటిని ఒక్క గుక్కలో త్రాగినందు వలన, దేవతలు కాలకేయులను సంహరించి ఋషులను కాపాడారు
తరువాత భగీరథుడు వచ్చి సముద్రాన్ని నింపు వరకు వేచి ఉండమని బ్రహ్మ చెప్పారు.
తరువాత సగర చక్రవర్తి గురించి చెపుతూ ఆయన ఇక్వాక్షు వంశములో రామచంద్ర మూర్తి కి 22 తరాల ముందు వున్నారు, ఆయనకు ఇద్దరు భార్యలు , సంతానం లేక పోవడం వలన ఈశ్వరుణ్ణి తపస్సు చేసి మెప్పించి మొదటి భార్యకు 60 వేలమంది పుత్రులు, రెండవ భార్యకు ఒక్క కొడుకును కన్నారు. 60 వేల మందికి ఒకేసారి చావు వుంటుంది అని చెప్పారు. రెండవ భార్య కొడుకు అసమంజసుడు పిల్లలను చంపి సముద్రంలో విసిరివేశాడు. తండ్రి సగరచక్రవర్తి ధర్మనిష్ట కలిగినవాడు కాబట్టి అసమంజసుడిని దేశ బహిష్కరణ కావించాడు, శ్రీనివాస మూర్తి వందన సమర్పణ తో ఈ రోజు సత్సంగ ముగిసింది🙏🏾
19-3-25 బుధవారం శ్రీమతి అరుణ గారు రామాయణం
హనుమంతుడు సీతాన్వేషణలో లంకనగరానికి వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని శ్రీరాములవారికి వివరించిన తరువాత వానర వీరులను అందరినీ సమావేశపరిచి యుద్దానికి అనంతమైన సముద్రాన్ని దాటడానికి ప్రణాళికను రూపొందించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు , జాంబవంతుడు, మిగతా వానర వీరులందరు కలసి అనంతమైన సముద్రాన్ని దాటుటకు మొదలు పెట్టారు.
ఇది అంతయూ రావణాసురుడు తెలుసుకొని తన మంత్రులతో చర్చించాడు. ఒక్క వానరుడు దుర్భేద్యమైన లంకా పట్టణం ప్రవేశం చేసి రాక్షస వీరులను ముప్పు తిప్పలు పెట్టి, నగరాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళాడు. ఇది చాలా కలత చెందే విషయమని దీనిని తీవ్రంగా ఆలోచించాలి అని మంత్రులతో చెప్పాడు.
ఇదంతా విన్న రాక్షస సేనాపతి ప్రహస్తుడు, మిగతా వీరులైన దుర్ముఖుడు, వజ్రదంస్త్రుడు, నిశుంభుడు, వజ్రహస్తుడు, ఇంద్రజిత్తు, ప్రహస్థుడు, విరూపాక్షుడు, దుర్ముఖుడు, వీరు అందరూ కోపంతో నీవు అంత దీర్ఘంగా అలోచించవలదు, మేము ఇంతమంది వీరులము వున్నాము వారందరినీ ఒక్క వేటుతో నాశనము చేసెదము అని ధైర్యం చెప్పారు.
అప్పుడు విభీషణుడు అందరినీ వారించి , నిషాచారులార శత్రుబల పరాక్రమము అప్రమేయముగా వున్నది, వారిని చులకన చేసి మాట్లాడడం మంచిది కాదు అని హితవు పలికాడు.
20-3-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు మూడవ సమూహం
విషయం : దేవతలు – వాహనాలు- విశిష్ఠత
21-3-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వరరావు గారు పురాణసాహిత్యం- లింగపురాణం
పునశ్చరణ , పంచముఖ లింగ వివరణ, దైవానికి నిర్వచనం, ఓంకార , ప్రణవ శబ్దానికి గల 3 అర్ధాలు, ఏకాక్షరీ మంత్రం ,పంచాక్షరీ మంత్రం , షడాక్షరీ మంత్రాలలో ఎవరు ఏది అనుష్ఠించాలి -వివరణ శరీరంలోని పది రకాల వాయువులు, శరీరంలో వాటి విధులు, మోక్ష సాధనాలు- శ్రవణ, కీర్తన, మనన-వివరణ
రెండవ వక్త – శ్రీమతి కృష్ణవేణి గారు
కీర్తన : రామజోగి మందు కొనరే ఓ జనులారా – భక్త రామదాసు రచన
22-3-25 శనివారం శ్రీ భగవాన్ సత్య శాయి శత జయంతి సందర్గా విశేష కార్యకర్మము
విషయం : నా జీవితంలో శ్రీ సత్య సాయి-సభ్యుల అనుభవాలు
ప్రసంగించిన సభ్యులు
శ్రీమతి అరుణ గారు
23-3-25 ఆదివారం గరికపాటి పవన్కుమార్ Life skills in AI age
24-3-25 సోమవారం శ్రీ రమణమూర్తి గారు వేదాంత సాహిత్యం
25-3-25 మంగళవారం శ్రీ సోమేశ్వర శర్మ గారు మహా భాగవతం
శుకబ్రహ్మ పరీక్షిత్తుకు మాయ ప్రపంచము గురించి చెపుతూ మనస్సును ఇంద్రియాలతో నిగ్రహించాలని , అహంకారము వదిలివేయాలి. బ్రహ్మ తపస్సుకు మెచ్చి నారాయణుడు వైకుంఠపురమును చూపించాడు, జగత్తు అంతా నా స్వరూపమే అని తెలుసుకోమని చెప్పాడు. మాయ ప్రభావము వలన ఉన్న వస్తువు లేకపోవడం, లేని వస్తువు కనపడటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడటం లేదు, అదే మాయ, ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలుసుకొంటే మాయ తొలగిపోతుంది
26-3-25 బుదవారం శ్రీమతి అరుణగారు రామాయణ
రావణుడికి అందరూ రాక్షసులు ధైర్యం చెప్పగా విభీషణుడు ఇంటికి వెళ్లి చాలా అపశకుణములు కనపడుచున్నవి, లంకకు చేటు కలుగుతుంది, దీనికి పరిష్కార మార్గం ఒక్కటే సీతను రాముడికి అప్పగించు అని చెప్పగా రావణుడు అవేమీ లేవు, నీవు వెళ్ళవచ్చు అని చెప్పాడు. తిరిగి మంత్రులతో సమావేశం కాగా రాక్షస వీరులు ధైర్యం చెప్పగా, కుంభకర్ణుడు లేచి తప్పు చేసావు, జరిగిందేదో జరిగింది, నీవు రాముడి వలన భయం విడచి హాయిగా వుండమని చెప్పాడు. మహాపార్షుడు లేచి నీవు సీతను అనుభవించి నీ కోరిక తీర్చుకున్నాడు, అందుకు రావణుడు నాకు బ్రహ్మ శాపం వుంది, ఏ స్త్రీ నైనా అనుమతి లేకుండా బలవంతముగా అనుభవిస్తే నాతల వెయ్యి వ్రొక్కలవుతుంది, అందుకే సీతా నన్ను వరించే వరకు ఆగాల్సిందే అని చెప్పాడు, అప్పుడుకూడా విభీషణుడు, సీతను రాముడి వద్దకు పంపి లంకను, రాక్షసులను కాపాడమని చెప్పాడు.
27-3-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు నాల్గవ సమూహం
విషయం : గగన తలంలో ఆరాధ్య దేవతలు- ధృవుడు, నవగ్రహాలు, సప్తర్షులు
28-3-25 శుక్రవారం శ్రీమతి రమణి గారు ముకుందమాలా స్తోతం
పునశ్చరణ లో 1,2,3 శ్లోకాలు , భావార్థం, 4,5,6 , 7,8 శ్లోకాలు , వివరణ
29-3-25 శనివారం శ్రీ భగవాన్ సత్య శాయి శత జయంతి సందర్గా విశేష కార్యకర్మము
“నా జివితంలో సత్య శాయి” సభ్యుల అభిప్రాయాలు
30-3-25 ఆదివారం ఉగాది వేడుకలు గ్లోబల్ స్కూల్ , వైట్ ఫీల్డ్
31-3-25 సోమవారం శ్రీ రమణమూర్తి గారు పంచాంగ శ్రవణము