డిశంబర్ దినసరి కార్యక్రమములు
తేది వారము వక్తపేరు విషయము
2-12-24 సోమవారం శ్రీ త్రినాధ రెడ్డి గారు భగవద్గిత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – దేహధారులైన మానవులకు అవ్యక్త పరమాత్మను అర్థంచేసుకోవడం, ఆ పరమాత్మతో అనుసంధానం కావడం కష్టతరం. అర్జునునికి కూడా శ్రీ కృష్ణ భగవానుడు వివరించిన ఆ అవ్యక్త పరమాత్మ తత్త్వాన్ని గ్రహించడం కష్టమైంది. కాబట్టి ఆ పరమాత్మ తత్త్వానికి ఒక దృశ్యం రూపం కలిగించి విరాట్పురుషునిగా అర్జునునికి గోచరించాడు శ్రీ కృష్ణ భగవానుడు. భగవద్గీతలో వర్ణించబడిన ఆ విరాట్పురుషుని దర్శించే ప్రయత్నం జరిగింది.
3-12-24 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
4-12-24 బుదవారం శ్రీమతి కళావతి గారు విష్ణు సహస్ర నామాలు
5-12-24 గురువారం ఆధ్యాత్మిక సదస్సు – మొదటి సమూహం
6-12-24 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
7-12-24 శనివారం శ్రీ విశ్వకిరణ్ గారు ఆటవిడుపు
8-12-24 ఆదివారం సెలవు
9-12-24 సోమవారం శ్రీ త్రినాధరెడ్డిగారు భగవద్గీత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – మన నిత్య జీవితంలో అక్షరం కావచ్చు, పదం కావచ్చు, అంకెలు కావచ్చు ప్రతీదీ ప్రతీకాత్మకత (Symbolism) తోనే ముడిపడి ఉంది అని వివరిస్తూ, మన దైవాల రూపాలు ఆ అవ్యక్త పరమాత్మతో అను సంధానం (connect) అయ్యేందుకు ఆ అవ్యక్త పరమాత్మకు ప్రతీకలు అని వివరించే ప్రయత్నం జరిగింది. నాసావారు ప్రయోగించిన హబుల్ టెలెస్కోపు పంపిన సమాచారం విశ్లేషించిన శాస్త్రజ్ఞులు ఈ విశ్వమంతా మనకు అర్థంకాని, అవ్యక్తమైన, అనిర్దేశ్యమైన, సర్వవ్యాపియైన, ఊహాతీతమైన, గొప్పదైన డార్క్ మేటర్ డార్క్ ఎనర్జీతో వ్యాపించి ఉందనే నిర్ణయానికి వచ్చారని, ఆ అవ్యక్తాన్నే మనవారు వేలసంవత్సరాలకు పూర్వమే పరమాత్మ అన్నారని, చివరకు సైన్సు కూడా భగవంతుని ఉనికిని అంగీకరించక తప్పలేదని వివరించే ప్రయత్నం జరిగింది.
10-12-24 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
11-12-24 బుధవారం గీతా జయంతి
12-12-24 గురువారం ఆధ్యాత్మిక సదస్సు – నాల్గవ సమూహం
13-12-24 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
14-12-24 శనివారం దత్తాత్రేయ జయంతి
15-12-24 ఆదివారం సెలవు
16-12-24 సోమవారం శ్రీ త్రినాధరెడ్డి గారు భగవద్గిత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – మన సనాతన ధర్మంలో సత్యాన్ని పరిశీలన, పరిశోధన, చర్చల ద్వారా నిర్ధారిస్తారనీ, దీనినే మీమాంస అంటారనీ, నేడు సైన్స్ కూడా సత్యాన్ని ఈ విధంగానే నిర్ణయిస్తుందనీ వివరించే ప్రయత్నం జరిగింది. ప్రత్యక్షప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమానం, అర్థాపత్తి, శబ్ద ప్రమాణం, అనుపలబ్ధి అనే ఆరు ప్రమాణాల ఆధారంగా మన సనాతన ధర్మంలో విషయం గ్రహించబడుతుందనీ వివరించే ప్రయత్నం జరిగింది. ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అని శంకరాచార్యులవారు చెప్పిన విషయాన్ని ఆధునిక భౌతిక శాస్త్ర పరిజ్ఞానంతో అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది. ఆధునిక భౌతిక శాస్త్రం కాంతి గాని, ఎలెక్ట్రానులు గాని, నువ్వు గాని, నేను గాని, గ్రహం గాని, నక్షత్రం గాని, ప్రతీదీ తరంగం గానూ, పదార్థంగా గానూ వ్యవహరిస్తూ ఉంటాయనీ, ఆ స్వభావం దానిని మనం గ్రహించేందుకు మనం ఉపయోగించే పరికరాలపై ఆధారపడి ఉంటుందని అంటుంది కాబట్టి, మన సహజ పరికరాలైన జ్ఞానేంద్రియాల ద్వారా మనకు కలిగే అవగాహన అవి కలిగించే భ్రమ మాత్రమేనని, ఈ విధంగా శంకరాచార్యుల వారు చెప్పిన బ్రహ్మ సత్యం జగన్మిథ్య సత్యమేనని వివరించే ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంలో ‘దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా।‘ అనే భగవద్గీతా శ్లోకాన్ని ఉటంకించడం జరిగింది.
17-12-24 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
18-12-24 బుధవారం శ్రి మతి కళావతి గారు విష్ణు సహస్ర నామాలు
19-12-24 గురువారం. ఆధ్యాత్మిక సదస్సు మూడవ సమూహం
20-12-24 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
21-12-24 శనివారం శ్రీమతి అరుణ గారు లలితాసహస్రనామాలు
22-12-24 ఆదివారం సెలవు
23-12-24 సోమవారం శ్రీ త్రినాధరెడ్డి గారు భగవద్గిత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – భగవద్గీతలో ప్రబోధించబడిన ‘ప్రాణి కోట్ల ఉత్పత్తి’ ని వివరించే ప్రయత్నం జరిగింది. సృష్టికి మూలం నిర్గుణ పరమాత్ముడని, ఆయన నుండి ఉత్పన్నమయిన బ్రహ్మ సకల జీవరాశులకు మాతృ స్థానమని, అందులో భగవంతుడు తన అంశను ప్రవేశ పెట్టడం ద్వారా జీవుల ఉత్పత్తి సంభవిస్తుందనీ, బ్రహ్మది మాతృస్థానమనీ, పరమాత్ముడు సకల జీవరాశులకు తండ్రియనీ, భగవద్గీతలో చెప్పబడిన విషయాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం జరిగింది. అద్వైత, ద్వైత మరియు విశిష్టాద్వైత సిద్దాంతాల మూల తత్త్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది.
24-12-24 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
25-12-24 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణు సహస్ర నామాలు
26-12-24 గురువారం ఆధ్యాత్మిక సదస్సు – రెడవ సమూహం
27-12-24 శుక్రవారం శ్రీ శ్రీనివాసమూర్తి గారు గురుమహిమ
28-12-24 శనివారం శ్రీ త్రినాధరెడ్డి గారు భగవద్గిత
29-12-24 ఆదివారమ సెలవు
30-12-24 సోమవారం సెలవు
31-12-24 మంగళవారం సెలవు